
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అల్‌ఖైదా అధిపతి అల్-జవహరీ అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా డ్రోన్ ‘ఎంక్యూ-9 రీపర్’ ను భారత్ కొనుగోలు చేయనుంది. ఇది అమెరికా సయం టెక్నాలజీతో తయారు చేసుకున్న అత్యాధునిక డ్రోన్ .అల్-జవహరీని చంపేందుకు అమెరికా అధికారులు అత్యంత కచ్చితత్వంతో హెల్‌ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తుంది.‘ప్రిడేటర్ బి’ డ్రోన్‌గానూ పిలిచే ఎంక్యూ-9 రీపర్.. హనీవెల్ టీపీసీ331-10 టర్బోప్రొప్ అనే ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. ఇందులో డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్ వ్యవస్థను జోడించారు. ఫలితంగా ఇంజిన్ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడింది. తక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు ఇంధనం వృథా కాకుండానూ అది రక్షణ కల్పిస్తుంది.
Also Read : రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి…
ఎంక్యూ-9 రీపర్‌లో పేలోడ్‌లను మోసుకెళ్లేందుకు ఏడు ఎక్స్‌టర్నల్ స్టేషన్లు ఉంటాయి. ఈ డ్రోన్ ఏకధాటిగా 27 గంటల పాటు గగన విహారం చేయగలదు. దాడులతో పాటు నిఘా కార్యకలాపాల్లోనూ దోహదపడుతుంది. దాని ఆపరేట్ చేయడమూ సులువే. ‘ప్రిడేటర్ బి’కి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా అత్యాధునిక ‘ప్రిడేటర్ బి ఈఆర్’ డ్రోన్లను కూడా ఇప్పటికే తయారుచేశారు. అమెరికా మట్టుబెట్టిన అల్‌ఖైదా అధినేత అల్ జవహరీకి మద్దతుదారులు భారత్‌లోనూ ఉన్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం. అవి బయట పడకపోయినా, జమ్మూ-కశ్మీర్ లో జరిగి అరాచకాలకు దాని అనుబంధ సంస్థలేఅనేది తాజా సమాచారం. ఓదశలో అల్‌ఖైదా అధినేతకు తాలిబన్లు తమ రాజధాని కాబూల్‌లో ఆశ్రయం కల్పించడంపై ఆందోళన వ్యక్తమయ్యాయి. ప్రధానంగా భారత్‌పై దాడులకు పాల్పడే ఉగ్ర సంస్థలకూ ఇక్కడినుంచే విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంది.
Read Also : మునుగోడు ఉపఎన్నిక… తెరపైకి కోత్త డిమాండ్లు…
అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ దగ్గరే ఈ తరహా ఆయుధాలున్నాయి. భారత్ కూడా వీటి కొనుగోలుకు ఆసక్తిగా ఉంది. 60 నుంచి 80 మిలియన్ డాలర్ల ఖరీదైన ఈ రీపర్ కొనుగోలుకు ఇప్పటికే భారత్-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. ధర విషయంలో స్పష్టత రాగానే ఒప్పందానికి సంతకాలు జరుగుతాయని విదేశీ వ్యవహారాలశాఖ నిపుణులు వెల్లడించారు. అల్ ఖైదా చీఫ్ జవహరీని హతమార్చడం భారత్ కు ముఖ్యమైన అంశం. భారత్ పై ఉగ్రదాడులకు పాల్పడే పలు సంస్థలకు కూడా తాలిబన్లు సౌకర్యాలు కల్పించే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఎవరికీ ఆశ్రయం ఇవ్వకుండా ఉండాలంటే జవహరీని హతమార్చడం సరైన చర్యగా భారత్ అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి :
- నిరుద్యోగులకు షాక్… సగానికి పైగా పోస్టులు వారితోనే భర్తీ !!
- మునుగోడు ఉప ఎన్నిక… మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం
- త్వరలో కాంగ్రెస్ గూటికి కర్నె ప్రభాకర్! నారాయణపురంలో అనుచరులతో మీటింగ్
- బ్రాందీ షాపులో పనికి రాడు.. బీజేపీ కుక్క బిస్కెట్లకు అమ్ముడుపోయాడు! కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్.
- మునుగోడుపై కాంగ్రెస్ దూకుడు… మధుయాష్కీ చైర్మెన్ గా ప్రచార కమిటి