
క్రైమ్ మిర్రర్, బాలాపూర్ : దినదినాభివృద్ధి చెందుతున్న బడంగ్పేట్ కార్పొరేషన్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నివారణకై ప్రయాణం సాఫీగా సాగేలా అవుటర్ రింగ్ రోడ్డు త్రిబుల్ ఆర్ కు అనుగుణంగా రోడ్ల అభివృద్ధికై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లింకు రోడ్ల అభివృద్ధి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా 15.5 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధికై 188 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది.
Read Also : మోడీ పిలుపు… మారుతున్న సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్
ఆర్సీఐ ఎక్స్ రోడ్ నుంచి ఎయిర్ పోర్టు హోటల్ వరకు, శ్రీశైలం హైవే నుంచి బడంగ్పేట్ వరకు 2.60 కిలో మీటర్ల మేరకు రోడ్డును అభివృద్ధి చేయడానికి 32కోట్లు కేటాయించారు. మల్లాపూర్ ఎక్స్ రోడ్ నుండి కుర్మల్ గూడ, బడంగ్పేట్ వరకు 3.29 కిలో మీటర్లకు 38 కోట్లు, కుర్మల్ గూడ నుండి నాదర్గుల్, బడంగ్పేట్ వరకు 3.30 కిలో మీటర్లకు 40 కోట్లు, బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుండి తుర్క యంజాల్ వరకు 3.80 కిలోమీటర్లకు 46 కోట్లు, బడంగ్పేట్ నుండి నాదర్ గుల్ మెయిన్ రోడ్డు వరకు 2.60కిలో మీటర్లకు 32 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే రోడ్ల పనులు చేపట్టనున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో రోడ్ల విస్తరణకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు, రోడ్డు విస్తరణ అయితే ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగి సమయం ఇంధనం ఆదా అవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : అల్-జవహరీ కొసం ఆరునెలల నిఘా.. ఆపై రహస్య యుద్ధం..
బడంగ్పేట్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి
హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతంగా ఉన్న బడంగ్పేట్ కార్పొరేషన్లో అధిక సంఖ్యలో ప్రజలు నివాసాలు ఏర్పరచుకుని వివిధ వ్యాపార ఉద్యోగాలు నిర్వహిస్తూ నగరానికి రాకపోకలు సాగించడంతోపాటు, శ్రీశైలం ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ప్రధాన లింకు రోడ్ల అభివృద్ధికి 188 కోట్ల నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బడంగ్పేట్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడ్డి రామ్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- నిజామాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్… భయాందోళనలో ప్రజలు
- ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం….
- తెలంగాణలో చంద్రబాబు రీఎంట్రి… ఎప్పుడు, ఎక్కడ ??
- ఆగష్టు 7న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?
- ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే… యూసఫ్ ఖాన్, తులసమ్మ తీరు ఇదే