
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : అనుకున్నట్లే జరిగింది. క్రైమ్ మిర్రర్ చెప్పిందే నిజమైంది. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా నిర్ణయం ప్రకటించారు. మునుగోడుకు ఉప ఎన్నిక రాబోతుందని… ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారని క్రైమ్ మిర్రర్ గత ఏడాది అక్టోబర్ లోనే చెప్పింది. కోమటిరెడ్డి రాజీనామా చేస్తారని మొదటగా వార్త ప్రచురించింది.
Also More : మునుగోడు ఓటర్లకు ఇక పండుగే..! ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా?
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉప ఎన్నిక వస్తే గాని అభివృద్ధి జరగడం లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. గిరిజనుల పోడు భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటుందని చెప్పారు. రాచకొండ రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తుందనే నమ్మకంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలనే నిర్ణయం, ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన రోజునే ఖరారైంది. అయితే అనుచరులతో చర్చించేందుకే ఆయన కొంత సమయం తీసుకున్నారని అంటున్నారు.
Also Read : అయితే టీఆర్ఎస్.. లేదంటే కాంగ్రెస్! మునుగోడులో కంచర్ల పోటీ ఖాయమే?
రాజగోపాల్ రెడ్డి చేయివదలి పోకుండా చూసేందుకు కాంగ్రెస్ నాయకత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. నల్గొండ జిల్లాకే చెందిన మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దూతలుగా రాజగోపాల రెడ్డి ఇంటికి వెళ్లి మరీ బుజ్జగింపు చర్చలు జరిపారు. అయినా రాజగోపాల రెడ్డి, నో’ అన్నారు. కాంగ్రస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, రంగంలోకి దిగారు. మాట్లాడుకుందాం ఢిల్లీకి రమ్మని పిలిచారు.అయినా రాజగోపాల రెడ్డి ఢిల్లీ వెళ్ళలేదు. ఇలా బుజ్జగింపుల మొదలు పదవుల బేరసారాలవరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పటికే బీజేపీ రాజకీయ,వ్యాపార చక్రబంధంలో చిక్కుకు పోయిన రాజగోపాల రెడ్డి ససేమిరా అన్నారు. పార్టీని వీడేందుకే మొగ్గు చూపారు.
ఇవి కూడా చదవండి …
- కన్నతల్లిపై కొడుకు కర్కశం.. ఆస్తి కోసం అమానుషం…
- డిఫరెంట్ ప్రజెంటేషన్‌లో “భూతద్ధం భాస్కర్ నారాయణ”…
- 188 కోట్ల నిధులతో మెరుగు పడనున్న ప్రధాన లింకు రోడ్లు
- మోడీ పిలుపు… మారుతున్న సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్
- అల్-జవహరీ కొసం ఆరునెలల నిఘా.. ఆపై రహస్య యుద్ధం..
2 Comments