
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో త్వరలోనే మునుగోడుకు ఉప ఎన్నిక రాబోతోంది. దీంతో అన్ని పార్టీలు మునుగోడు నియోజకవర్గంపై ఫోకస్ చేశాయి. తమ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తమకు గట్టి పట్టున్న మునుగోడు నియోజకవర్గంలో స్తతా చాటేందుకు సిద్ధమవుతోంది. మునుగోడుపై విషయంలో దూకుడుగా వెళుతోంది పీసీసీ. ఈనెల ఐదున మునుగోడులో నియోజకవర్గ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. మునుగోడులో తాము బలంగా ఉన్నామని, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తమ గెలుపును ఆపలేరని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈనెల ఐదున జరిగే సమావేశానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కేడర్ మొత్తం కదిలి రావాలని ఆయన పిలుపిచ్చారు.
Read More : బీజేపీ కుక్క బిస్కెట్లకు అమ్ముడుపోయాడు! కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్..
మునుగోడులో సమావేశం పెట్టడమే కాదు అప్పుడే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. మునుగోడు ఉప ఎన్నిక కోసం స్ట్రాటజీ కమిటి, క్యాంపెయిన్ కమిటీని ఏర్పాటు చేసింది. పీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ కన్వీనర్ గా ఏడుగురు సభ్యులతో ఈ కమిటి ఏర్పాటైంది. కమిటీలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, అనిల్ కుమార్ ఉన్నారు. ఈ కమిటీ రేపటి నుంచే రంగంలోకి దిగనుంది. కాంగ్రెస్ పార్టీ కేడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లకుండా చూడటంతో పాటు బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేయనుంది.
ఇవి కూడా చదవండి …
- మునుగోడు ప్రజలకు ఇక పండుగే… ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
- కన్నతల్లిపై కొడుకు కర్కశం.. ఆస్తి కోసం అమానుషం
- డిఫరెంట్ ప్రజెంటేషన్‌లో “భూతద్ధం భాస్కర్ నారాయణ”…
- 188 కోట్ల నిధులతో మెరుగు పడనున్న ప్రధాన లింకు రోడ్లు
- మోడీ పిలుపు… మారుతున్న సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్
One Comment