
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పాటు మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ కోమటిరెడ్డి ప్రకటన చేసిన కాసేపటికే మీడియా ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి… రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇవ్వకుంటే… మీరు బ్రాందీ షాపుల్లో పనిచేయడానికి కూడా పనికి రారంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడినా ఆయన సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని రేవంత్ రెడ్డి చెప్పారు.
Read More : మునుగోడుపై కాంగ్రెస్ దూకుడు… మధుయాష్కీ చైర్మెన్ గా ప్రచార కమిటి
ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తుంటే… మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాను ఈడీ వేధిస్తుంటే… శత్రువుతో భేటీ అవుతారా? అని ఆయన మండిపడ్డారు. ఎప్పుడైతే అమిత్ షాతో భేటీ అయ్యారో.. అప్పుడే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్‌తో పేగు బంధం తెగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ విసిరే ఎంగిలి మెతుకులకే కొందరు ఆశపడుతున్నారని రేవంత్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీకి చేరువవుతున్నారని కూడా రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూస్తే సహించేది లేదని కూడా ఆయన హెచ్చరించారు.
Read More : మునుగోడు ప్రజలకు ఇక పండుగే… ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియా అయితే… ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డి తల్లికి ద్రోహం చేశారని రేవంత్ ధ్వజమెత్తారు. ఆర్థిక లావాదేవీల కోసం కన్నతల్లి లాంటి పార్టీని వీడారని కూడా ఆయన ఆరోపించారు. ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కాదన్న రేవంత్… బీజేపీకి అనుకూలంగా పనిచేసే ఎలక్షన్ డిపార్ట్ మెంట్ అని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలను వేధించేందుకే ఈడీని బీజేపీ వినియోగిస్తోందన్నారు. మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకోసం ఎన్నికల కమిటీ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. ఉప ఎన్నికలో ఎవరు అడ్డు వచ్చినా తొక్కుకుంటూ వెళతామని రేవంత్ చెప్పారు.
ఇవి కూడా చదవండి …
- కన్నతల్లిపై కొడుకు కర్కశం.. ఆస్తి కోసం అమానుషం.
- డిఫరెంట్ ప్రజెంటేషన్‌లో “భూతద్ధం భాస్కర్ నారాయణ”…
- 188 కోట్ల నిధులతో మెరుగు పడనున్న ప్రధాన లింకు రోడ్లు
- మోడీ పిలుపు… మారుతున్న సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్
- అల్-జవహరీ కొసం ఆరునెలల నిఘా.. ఆపై రహస్య యుద్ధం..
One Comment