
క్రైమ్ మిర్రర్, నిజామాబాద్ ప్రతినిధి : నిజామాబాద్ నగరంలో గతంలో చోరీలు చేసి నగరప్రజలను భయాందోళనకు గురి చేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులు మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా అర్ధరాత్రి నగర వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కంటేశ్వర్, హౌజింగ్ బోర్డు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ ముఠా సభ్యులు కాలనీల్లో సంచరిస్తున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డవడంతో పోలీసులు చెడ్డీ గ్యాంగ్ కదలికలపై ఫోకస్ పెట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ముఠా కోసం గాలిస్తున్నారు. రాత్రి సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా.. తెలియని వ్యక్తులు కాలనీల్లో ఉన్నట్టు అని పించినా వెంటనే మీ దగ్గలోని పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.
Also Read : ఇరవైనాలుగు గంటలు కాకముందే నేలకొరిగిన విధ్యుత్ స్థంబాలు….
ప్రతి కాలనీల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే చెడ్డీ గ్యాంగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. వారిని పట్టుకునే ప్రయత్నం, ఎదిరించే ప్రయత్నం చేస్తే మారణాయుధాలతో అత్యంత దారుణంగా ఎటాక్ చేస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ సీసీ పుటేజ్ బయటకు రావడంతో నగరంలోని శివారు ప్రాంత వాసులు కనుకు వేయకుండా రాత్రి వేళ జాగారం చేస్తున్నారు. గతంలో జరిగిన దాడులు, చెడ్డీగ్యాంగ్ ఆగడాలను గుర్తు చేసుకొని గజగజ వణికిపోతున్నారు.
Read Also : ఆగష్టు 7న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?
కొద్ది రోజుల క్రితమే నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ లో ఓ ఇంట్లో చొరబడేందుకు యత్నించించారు. తలుపులు తీయమని యజమానిని బెదిరించారు. ఇంటి తలుపులు, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఓ వ్యక్తికి గాయలయ్యాయి. మరో ఇంట్లో భార్యాభర్తలను మంచానికి కట్టేసి మెడలో మంగళసూత్రం ఎత్తుకెళ్లారు. కంటేశ్వర్, హౌసింగ్ బోర్డ్, వినాయక్‌నగర్‌లోని ఓ ఆపార్టు మెంట్‌లో మహలక్ష్మి నగర్ లోని ఓ ఇంట్లో చోరీలకు పాల్పడ్డారు. ఈ దొంగల ముఠా నిక్కర్లు వేసుకొని శబ్ధం రాకుండా ఉండేందుకు కాళ్లకు చెప్పులు లేకుండా ఎవరికి చిక్కకుండా శరీరానికి నూనె రాసుకొని ..ఎవరైనా ఎదురు తిరిగితే దాడి చేయడానికి ఆయుధాలు, ఇనుప రాడ్లను తీసుకొని కాలనీలు, ఇళ్లలో చొరబడతారు. ఇప్పుడూ అదే విధంగా చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీ ఇవ్వడంతో భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు నిజామాబాద్ నగర ప్రజలు.
ఇవి కూడా చదవండి :
- ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య.. అన్నగారి కుటుంబంలో తీవ్ర విషాదం
- ఆత్మహత్య చేసుకున్న ఉమామహేశ్వరికి జీవితంలో కీలక అంశాలు ఇవే
- ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం….
- తెలంగాణలో చంద్రబాబు రీఎంట్రి… ఎప్పుడు, ఎక్కడ ??
- ఎన్టీఆర్ ఫ్యామీలీలో ఎంత చనిపోయారు.. ఎలా చనిపోయారో తెలుసా?
2 Comments