
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలోనే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది. దీంతో మునుగోడులో రాజకీయ సందడి కనిపిస్తోంది. ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు అప్పుడే వ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీలో చేరనున్న రాజగోపాల్ రెడ్డే ఆ పార్టీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అధికార పార్టీలో ప్రస్తుత ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఎవరు ఉంటారన్నదే ఆసక్తిగా మారింది.
Read More : బీజేపీలో చేరబోయే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వీళ్లేనా? హైకమాండ్ కు ఈటల జాబితా..
మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటిని కూడా ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంగళవారం కర్నె ప్రభాకర్ తన స్వగ్రామం సంస్థాన్ నారాయణపురంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. తన అన్న కర్నె రవికుమార్ వర్ధంతి సందర్భంగా తన వ్యవసాయ క్షేత్రంలో లంచ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తనకు మద్దతుగా ఉన్న నేతలను పిలిచారు. ఒక రకంగా బల ప్రదర్శన చేశారు కర్నె ప్రభాకర్. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై తన అనచరులతో చర్చించడానికే కర్నె ప్రభాకర్ ఆ కార్యక్రమం పెట్టుకున్నారని చెబుతున్నారు.
Read More : మునుగోడుకు ఉపఎన్నిక వస్తే…. అధికార పార్టీలో మొదలైన భయం??
మునుగోడు ఉప ఎన్నికలో తనకు టీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే అవకాశం లేదని.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం ఉందని తన అనుచరులతో కర్నె ప్రభాకర్ చెప్పారని తెలుస్తోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని.. కాంగ్రెస్ టికెట్ ఇస్తే గెలవడం ఈజీగానే ఉంటుందని ఆయన అనుచురులు చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ హామీ వస్తే కాంగ్రెస్ పార్టీలో చేరాలని.. తామంతా మద్దతుగా వస్తామని మెజార్టీ నేతలు కర్నెకు భరోసా ఇచ్చారని సమచారం. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కొన్ని రోజులుగా కర్నె ప్రభాకర్ తో మాట్లాడుతున్నారని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని కొన్ని నెలల క్రితమే అంచనాకు వచ్చిన పీసీసీ పెద్దలు.. కర్నెతో టచ్ లోకి వచ్చారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న కర్నె పోటీ చేస్తే తమకు విజయం ఖాయమనే ధీమాలో కాంగ్రెస్ అగ్ర నేతలు ఉన్నారని అంటున్నారు.
Read More : రాజగోపాల్ రెడ్డి చేరికపై క్లారిటీ ఇచ్చిన బండి…
మరోవైపు టీఆర్ఎస్ లో కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు కర్నె ప్రభాకర్. 2014లో మునుగోడు టికెట్ ఆశించినా చివరి నిమిషంలో చేజారింది. తర్వాత ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు సీఎం కేసీఆర్. తర్వాత శాసనమండలిలో ప్రభుత్వ విప్ గా నియమించబడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కర్నెకు టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాకా ప్రాధాన్యం తగ్గింది. గతంలో ప్రగతి భవన్ కు ఎప్పుడంటే అప్పుడు వెళ్లిన కర్నెకు కొంత కాలంగా ఆ పరిస్థితి లేకుండా పోయింది. కావాలనే కర్నెను కేసీఆర్ దూరం పెట్టారనే ప్రచారం సాగింది. అందుకే ఎమ్మెల్సీని రెన్యూవల్ చేయలేదంటున్నారు. ఉద్యమంలో ముందున్న తనను టీఆర్ఎస్ పెద్దలు నిర్లక్ష్యం చేయడంపై కర్నె తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుండటం.. కాంగ్రెస్ నుంచి ఆహ్వానం రావడంతో కర్నె ప్రభాకర్ తన అనుచరులతో సమావేశం అయ్యారని చెబుతున్నారు. మునుగోడు టికెట్ హామీ ఇస్తే ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమంటున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే కర్నె ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమంటున్నారు ఆయన అనుచరులు.
ఇవి కూడా చదవండి ….
- బీజేపీ కుక్క బిస్కెట్లకు అమ్ముడుపోయాడు! కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్..
- మునుగోడుపై కాంగ్రెస్ దూకుడు… మధుయాష్కీ చైర్మెన్ గా ప్రచార కమిటి
- మునుగోడు ప్రజలకు ఇక పండుగే… ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
- కన్నతల్లిపై కొడుకు కర్కశం.. ఆస్తి కోసం అమానుషం.
- డిఫరెంట్ ప్రజెంటేషన్‌లో “భూతద్ధం భాస్కర్ నారాయణ”…