
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకు ఓ పార్టీకి అనుకూలంగా ఉన్న రాజకీయం.. ఒక్కసారిగా మరో పార్టీకి అనుకూలంగా మారిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల నుంచి చాలాకాలం క్రితమే పక్కకు తప్పుకున్న చంద్రబాబు మళ్లీ ఇక్కడి రాజకీయాలపై ఫోకస్ చేయాలని చూడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పోలవరం ముంపు గ్రామాలను సందర్శించిన చంద్రబాబు.. ఆ తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీని ఎన్నికల కోసం సమాయత్తం చేయాలని వారికి సూచించారు. సెప్టెంబర్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని.. అందులో తాను పాల్గొంటానని ఖమ్మం జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారని తెలుస్తోంది.
Also Read : ఇరవైనాలుగు గంటలు కాకముందే నేలకొరిగిన విధ్యుత్ స్థంబాలు….
అయితే ఉన్నట్టుండి చంద్రబాబు మళ్లీ తెలంగాణ రాజకీయాలు.. అందులోనూ ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఫోకస్ చేయడంపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రంలో టీడీపీ బలహీనపడింది. టీడీపీ బలంగా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు ఖమ్మం జిల్లాలోనూ ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే 2018లో టీఆర్ఎస్ హవా ఎక్కువగా వీచినప్పటికీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు సీట్లు గెలుచుకుంది. సత్తుపల్లి, అశ్వారావుపేటలో టీడీపీ తరపున పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు.
Read Also : ఆగష్టు 7న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?
ఆ తరువాత ఆ ఇద్దరు మళ్లీ టీఆర్ఎస్‌లో చేరిపోయినప్పటికీ.. టీడీపీ ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో బలం ఉందనే విషయాన్ని ఆ రెండు నియోజకవర్గాల్లో గెలుపు స్పష్టం చేసింది. దీంతో తమకు బలం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫోకస్ చేయాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఇటీవల తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదే ఎక్కువగా ఫోకస్ చేయడం కూడా టీడీపీ మళ్లీ ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టడానికి మరో కారణం కావొచ్చనే వాదన వినిపిస్తోంది.
Also Read : మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి బండి సంజయ్.. ఏం జరుగుతోంది?
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్‌టీపీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కూడా ఖమ్మం జిల్లాపై మళ్లీ ఫోకస్ చేయడంతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ నిజంగానే చంద్రబాబు సారథ్యంలో ఖమ్మంలో సభ పెడితే.. టీడీపీ మళ్లీ తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసినట్టు అనుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఎన్టీఆర్ ఫ్యామీలీలో ఎంత చనిపోయారు.. ఎలా చనిపోయారో తెలుసా?
- ఆత్మహత్య చేసుకున్న ఉమామహేశ్వరికి జీవితంలో కీలక అంశాలు ఇవే..
- ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే… యూసఫ్ ఖాన్, తులసమ్మ తీరు ఇదే
- బీజేపీలో చేరబోయే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వీళ్లేనా? హైకమాండ్ కు ఈటల జాబితా..
- వారం తర్వాత హైదరాబాద్ కు కేసీఆర్.. ఢిల్లీకి ఏం చేసినట్లు?