
క్రైమ్ మిర్రర్,అమరావతి : కన్నతల్లి పట్ల ఓ కొడుకు అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. కంటి జబ్బుతో బాధపడుతూ శుక్లం ఆపరేషన్ చేయించుకుందని కూడా చూడకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. నవమాసాలు మోసి, కనీ పెంచిన కన్నతల్లినే జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు లాక్కురావడమే కాకుండా…కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి- తాడేపల్లి -నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read : మోడీ పిలుపు… మారుతున్న సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్
తన కుమారునితో పాటు కోడలు, ఆమె తండ్రితో పాటు బంధువు ఒకరు ఈ దాడి ఘటన సమయంలో ఉన్నారని ఆ కన్నతల్లి కన్నీటి పర్యంతమైంది. కన్నకొడుకు తనను జుట్టుపట్టి ఇంట్లో నుంచి బయటకు లాగి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినా ఎక్కడ తన పరువు, తన కుమారుని పరువు పోతుందోనని ఆ మాతృమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేయలేదంటే ఆమె మనస్సు ఎటువంటిదో ఆ కర్కశకుడు ఇప్పటికైనా గ్రహించాలి.
ఇవి కూడా చదవండి :
- అల్-జవహరీ కొసం ఆరునెలల నిఘా.. ఆపై రహస్య యుద్ధం..
- నిజామాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్… భయాందోళనలో ప్రజలు
- ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం….
- తెలంగాణలో చంద్రబాబు రీఎంట్రి… ఎప్పుడు, ఎక్కడ ??
- ఆగష్టు 7న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?
One Comment