
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఉదయం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఎమ్మెల్యే సోంత నియోజకవర్గం అయిన ఆర్మూర్ కు చెందిన మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా గుర్తించారు. తన భార్య సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యే పై కక్ష పెంచుకున్నాట్లు తెలుస్తొంది. ఎమ్మెల్యే ఇంటి దగ్గర మంగళవారం ఉదయం ప్రసాద్ గౌడ్ అనుమానాస్పదంగా తిరుగడం గమనించిన ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ గౌడ్ నుండి కత్తి, పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ వర్గాలు అందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- బీజేపీలో చేరబోయే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వీళ్లేనా? హైకమాండ్ కు ఈటల జాబితా..
- ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే… యూసఫ్ ఖాన్, తులసమ్మ తీరు ఇదే
- ఆగష్టు 7న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?
- మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి బండి సంజయ్.. ఏం జరుగుతోంది?
- ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య.. అన్నగారి కుటుంబంలో తీవ్ర విషాదం