
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గత 2011 లో మట్టుపెట్టిన అమెరికా సైన్యం ఇపుడు తాజాగా అల్‌ఖైదా అగ్రనాయకుడు అల్-జవహరీని మట్టుబెట్టింది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరీని హతమార్చినట్లు అమెరికా ప్రకటించింది. మరోవైపు అఫ్గానిస్థాన్‌లో చేపట్టిన ఓ విజయవంతమైన ఉగ్రవాద నిరోధన ఆపరేషన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రకటన చేయనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. మరోవైపు కాబుల్‌లోని షేర్పూర్ ప్రాంతంలోని ఓ నివాసంపై వైమానిక దాడి జరిగినట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు. ఈజిప్టు సర్జన్ అయిన అల్-జవహరీ ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా అమెరికా అభివర్ణిస్తుంది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3 వేల మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన సూత్రదారుల్లో ఒకరిగా అల్-జవహరీని అమెరికా గుర్తించింది. అప్పటినుంచి వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా జవహరీ పరారీలోనే ఉన్నాడు. అమెరికా దళాలు 2011లో ఒసామా బిన్ లాడెన్ హతమార్చిన తర్వాత అల్-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు.
Also Read : నిజామాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్… భయాందోళనలో ప్రజలు
9/11 దాడుల వ్యూహకర్తలైన ఉగ్ర అగ్రనేతలను సీఐఏ అత్యంత పక్కగా ప్రణాళికలు రచించి మట్టుబెడుతోంది. తాజాగా తాలిబన్ రాజ్యంలో అల్‌ఖైదా అగ్రనేత అల్-జవహరీని కూడా అదేవిధంగా హతమార్చింది. ఇందుకోసం సీఐఏ సుదీర్ఘకాలం కాపు కాసినట్లు సమాచారం. అత్యంత భారీ రక్షణ వలయంలో ఉండే అతడిని మట్టు పెట్టడం కోసం అమెరికా 20 ఏళ్లు ఓపిగ్గా వేచి చూసింది. సమయం రాగానే రహస్య ఆయుధంతోలేపేసింది. అసలు ఏం జరిగిందో తాలిబన్లు తెలుసుకునేటప్పటికే.. అక్కడి నుంచి డ్రోన్లు అదృశ్యమైపోయాయి.
Read Also : ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం….
దాడి జరిగిన సమయంలో జవహరీ తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్నాడు. సీఐఏ గురి నుంచి గతంలో జవహరీ పలు మార్లు తప్పించుకున్నట్లు అమెరికా నిఘావర్గాల సమాచారం. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ సారి ఆపరేషన్ కోసం సీఐఏ సుదీర్ఘ ప్రణాళికను రచించి అమలు చేసింది.అల్‌ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన 11 ఏళ్లకు జవహరీని మట్టుబెట్టింది అమెరికా. అతడు, భార్య, కుమార్తెలు కాబూల్‌లోని ఓ భవనంలో ఉంటున్నట్లు కీలక సమాచారం లభించింది. అమెరికా నిఘా సంస్థలు.. ఆ ఇంట్లో ఉంటోంది జవహరీ అనే నిర్ధారించుకున్నాయి. వెంటనే అలాంటి ఇంటి మోడల్‌నే అమెరికాలో తయారు చేశారు. ఆ తర్వాత దానిని శ్వేతసౌధంలోని సిచ్యువేషన్ రూమ్‌కు తీసుకొచ్చారు. ఆ ఇంటి వద్దే దాడి చేయాలని నిర్ణయించారు. జవహరీ అప్పుడప్పుడు ఇంటి బాల్కనీలో కూర్చుంటాడని గుర్తించారు. అతడిపై దాడికి సంబంధించిన పూర్తి ప్రణాళిక మొత్తం అమెరికా అత్యున్నత స్థాయి అధికారుల్లో అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో నిఘా బృందంలోని ఒక అధికారిని అతడి దినచర్యపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా నియమించారు.
Also Read : తెలంగాణలో చంద్రబాబు రీఎంట్రి… ఎప్పుడు, ఎక్కడ ??
జులై 31వ తేదీన కాబూల్‌లోని భవనంలో జవహరీ ఒంటిరిగా బాల్కనీలో నిలబడి ఉన్నాడు. బాల్కనీలో ఉన్నది అతడేనని ప్రత్యేక అధికారి నిర్ధారించారు. వెంటనే.. అమెరికా సీఐఏకు చెందిన డ్రోన్.. రెండు హెల్‌ఫైర్ క్షిపణులను ప్రయోగించింది. దాడికి కొద్ది వారాల ముందు బైడెన్.. నిఘా సంస్థలు, కేబినెట్ అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీలతో కీలక సమావేశాలు నిర్వహించారు. దాడి సమయంలో కేవలం జవహరీనే లక్ష్యంగా చేసుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ దృవీకరించారు.
ఇవి కూడా చదవండి :
- ఇరవైనాలుగు గంటలు కాకముందే నేలకొరిగిన విధ్యుత్ స్థంబాలు….
- ఆగష్టు 7న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?
- ఎన్టీఆర్ ఫ్యామీలీలో ఎంత చనిపోయారు.. ఎలా చనిపోయారో తెలుసా?
- ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే… యూసఫ్ ఖాన్, తులసమ్మ తీరు ఇదే
- బీజేపీలో చేరబోయే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వీళ్లేనా? హైకమాండ్ కు ఈటల జాబితా..
One Comment