
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకునేలా అధికార, విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. చేరికల కోసమే బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయిమాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బీజేపీ చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించింది. పార్టీ పెద్దల డైరెక్షన్ లోనే ఈటల రాజేందర్. రహస్యంగా మంత్రాంగం నడిపిస్తున్నారు. ఆషాడమాసం ముగిశాకా ఆగస్టులో పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని వారం రోజుల క్రితం బండి సంజయ్, ఈటల రాజేందర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఢిల్లీకి వెళ్లారు ఈటల రాజేందర్. బీజేపీ పెద్దలను కలవబోతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరబోయే జాబితాతో రాజేందర్ ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది. ఆ లిస్టును హైకమాండ్ కు చూపించి చర్చిస్తారని సమాచారం.
ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ జాబితాలో ఉన్న నేతల పేర్లు ఇవేనంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది..
ఆ జాబితాలోని పేర్లు ఇవిగో..
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపెద్దపల్లి జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ గట్టిముక్కల సురేశ్ రెడ్డి
వరంగల్ జిల్లాకు చెందిన కన్నెబోయిన రాజయ్య యాదవ్( ఈయన ఆదివారం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు )
రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గానికి చెందిన ఓ టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే ( జహీర్ బాద్ ఎంపీ బీబీ పాటిల్ అని టాక్ )
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ( పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి )
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ( తుమ్మల నాగేశ్వర్ రావు )
మహబూబ్ నగర్ జిల్లాకు చెంది మాజీ మంత్రి ( జూపల్లి కృష్ణారావు )
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే (
కాంగ్రెస్ తరపున టీవీ డిబేట్లలో పాల్గొనే ఇద్దరు కీలక నేతలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమెల్యే , మాజీ ఎమ్మెల్సీ
ఇవి కూడా చదవండి …
- ఎన్టీఆర్ ఫ్యామీలీలో ఎంత చనిపోయారు.. ఎలా చనిపోయారో తెలుసా?
- ఆత్మహత్య చేసుకున్న ఉమామహేశ్వరికి జీవితంలో కీలక అంశాలు ఇవే..
- ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే… యూసఫ్ ఖాన్, తులసమ్మ తీరు ఇదే
- ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య.. అన్నగారి కుటుంబంలో తీవ్ర విషాదం
3 Comments