
- చేసేదంతా మోసమే… నిజాలను చెబితే బ్లాక్ మెయిల్ అంటూ బద్నాం
- దమ్ముంటే… తాను ఎక్కడ ప్లాట్లు ఇస్తారో బహిరంగ ప్రకటన చేయాలి
క్రైమ్ మిర్రర్ నిఘా ప్రతినిధి బృందం : ఉల్టా చోర్ కొత్వాల్ కు ఢాంటే అన్న సామెత అచ్చంగా నల్లగొండ పట్టణానికి చెందిన యూసుఫ్ ఖాన్, వాసం తులసమ్మ అలియాస్ సుల్తానా దంపతులకు అతికినట్టు సరిపోతుంది. చేసేది మోసం… వారి అక్రమాల గురించి రాస్తే, బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ అరిచి పెడ బొబ్బలు పెడుతున్నారు. యూసఫ్ ఖాన్, వాసం తులసమ్మ దంపతులు మన్సురాబాద్ సర్వేనెంబర్ 7లో తమకు వందల ఎకరాల భూములు ఉన్నాయని, ఈ భూములన్నీ హనీఫా బి అనే తమ బంధువు పేరిట ముంతకాబ్ ద్వారా సంక్రమించాయని ప్రచారం చేసుకున్నారు.
Read More : తెరాసకు షాక్… సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్ రాజీనామా
ఈ భూములపై హైకోర్టును ఆశ్రయించినట్లు, కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రానున్నదని చెప్పి, కోర్టు తీర్పు రాకమునుపే, ఏజెంట్లను నియమించుకొని 100 గజాల చొప్పున ప్లాట్లు బహుమతిగా ఇస్తామని అమాయక పేద ప్రజల వద్ద నుంచి 30 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసి నోటరీ పత్రాలను అందజేశారు. దాదాపుగా 30 వేల మంది వద్ద అమాయక ప్రజల వద్ద నుంచి ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి, ప్లాట్లు ఇవ్వకుండా ముఖము చాటేయడమే కాకుండా, ఈ కుంభకోణం గురించి వెలుగులోకి తీసుకువచ్చిన క్రైమ్ మిర్రర్ దినపత్రిక పై అబాండాలను వేసే ప్రయత్నం చేస్తున్నారు.
Read More : భారత సీజేఐ ఎన్వీ రమణకు ఓయూ డాక్టరేట్ ప్రధానం…
యూసఫ్ ఖాన్, వాసం తులసమ్మలు ఒకవేళ ఈ భూకుంభకోణానికి పాల్పడి ఉండి , ఉండకపోతే తమపై పరువు నష్టం దావాను వేసుకోవచ్చునని ఇప్పటికే, క్రైమ్ మిర్రర్ దినపత్రిక యాజమాన్యం స్పష్టంగా ప్రకటించింది. దమ్ముంటే… తాము ఈ అక్రమాలకు పాల్పడలేదని, పేదలకు ప్లాట్లు ఇస్తామని చెప్పి నోటరీలు చేసి ఇవ్వలేదని, అనీఫా బి పేరిట అక్రమంగా ముంతకాబ్ పత్రాన్ని సృష్టించలేదని చెప్పే ధైర్యం యూసుఫ్ ఖాన్ దంపతులకు ఉందా? అని క్రైమ్ మిర్రర్ దినపత్రిక యాజమాన్యం ప్రశ్నిస్తోంది. తమ వద్ద యూసుఫ్ ఖాన్ అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, స్వయంగా ఆయన అల్లుడు సతీష్ తమ కార్యాలయానికి వచ్చి ఇచ్చిన వాంగ్మూలం ఆడియో టేప్ కూడా తమ వద్ద ఉన్నదని స్పష్టం చేశారు.
Also Read : దాయాది దేశంలో రికార్డు సృష్టించిన హిందూ యువతి…
అల్లుడే స్వయంగా, తమ అత్త మామ, న్యాయవాది షేక్ జిలాని తో కలిసి పేదలను వంచిస్తున్నారని తేల్చి చెప్పారని, ఇంకా ఇంతకంటే వారి అక్రమాల గురించి కావలసిన ఆధారాలు ఏమి ఉంటాయని దినపత్రిక యాజమాన్యం ప్రశ్నిస్తోంది. కేసుల కోసం తాము భయపడే రకం కాదని, పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వారి పక్షాన పోరాడడమే తమకు తెలిసిన నీతి అని, దానికోసం తమ అక్షర యజ్ఞం ఎప్పటికీ కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి ….
- మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి బండి సంజయ్.. ఏం జరుగుతోంది?
- వారం తర్వాత హైదరాబాద్ కు కేసీఆర్.. ఢిల్లీకి ఏం చేసినట్లు?
- పార్టీని బలోపేతం చేస్తేనే 19 లోక్ సభ స్థానాలు… రఘురామకృష్ణంరాజు
- టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అలనాటి స్టార్ హీరోయిన్…
- పాండవులు, కౌరవుల మధ్యే ఎన్నికలు… రాజగోపాల్ రెడ్డి