
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : తెలంగాణ రాజకీయాలు కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతుండగా… ఎప్పుడున్నది క్లారిటీ రావడం లేదు. అయితే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. ఆగష్టు 7 వ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలనే నిర్ణయం, ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన రోజునే ఖరారైంది. అయితే, అనుచరులతో చర్చించేందుకే ఆయన కొంత సమయం తీసుకున్నారని అంటున్నారు.
రాజగోపాల్ రెడ్డి పార్టీ వదలి వెళ్లకుండా కాంగ్రెస్ నాయకత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దూతలుగా రాజగోపాల రెడ్డి ఇంటికి వెళ్లి మరీ బుజ్జగింపు చర్చలు జరిపారు. అయినా రాజగోపాల రెడ్డి మనస మారలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, మాట్లాడుకుందాం రమ్మంటూ కోమటిరెడ్డిని ఢిల్లీకి పిలిచారు.అయినా రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్ళలేదు. పార్టీని వీడేందుకే మొగ్గు చూపారు. ఉపఎన్నికతో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడమే తన ఎజెండా అంటున్నారు.దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇక లాభం లేదని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
Read More : బీజేపీలో చేరబోయే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వీళ్లేనా? హైకమాండ్ కు ఈటల జాబితా..
నిజానికి మునుగోడు ఉపఎన్నిక అధికార టీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ పార్టీకే కీలకమని కాంగ్రెస్ ముఖ్యనాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈ ఉప ఎన్నికల్లొనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మరో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేక పోయిందనే ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మరింత దెబ్బ తింటుందని అంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి ఇమేజ్ ని దెబ్బ తీయడమే కాకుండా పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం పై చేయి సాధిస్తుందని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ముఖ్యనాయకులతో సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటువేసే విషయంతో పాటుగా ఉప ఎన్నిక అనివార్యమైతే ఎవరిని బరిలో దించాలనే అంశంపై చర్చించారని తెలుస్తోంది. హుజురాబాద్ ఉఫ ఎన్నికలో చివరి వరకు అభ్యర్ధిని ఖరారు చేయక పోవడం వలన ఘోరాతి ఘోరంగా ఓడి పోయామనే భావనలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం మునుగోడు విషయంలో ముందు చూపుతో అడుగు వేస్తోందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- ఎన్టీఆర్ ఫ్యామీలీలో ఎంత చనిపోయారు.. ఎలా చనిపోయారో తెలుసా?
- ఆత్మహత్య చేసుకున్న ఉమామహేశ్వరికి జీవితంలో కీలక అంశాలు ఇవే..
- ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే… యూసఫ్ ఖాన్, తులసమ్మ తీరు ఇదే
- ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య.. అన్నగారి కుటుంబంలో తీవ్ర విషాదం
- మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి బండి సంజయ్.. ఏం జరుగుతోంది?
One Comment