
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఆగస్టు 5న యూనివర్సిటీలో 82వ స్నాతకోత్సవం సందర్భంగా జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం. చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరవుతారు. ఈ కార్యక్రమలోజస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు అధికారిక సమాచారం. రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి ఓయూ ప్రదానం చేస్తున్న గౌరవ డాక్టరేట్ ను జస్టిస్ ఎన్వీ రమణ అందుకోనుండం ఆనందంగా ఉందంటున్నారు ఉస్మానియా విద్యార్ధులు. 2001లో చివరిసారి ఇండియన్ అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ అరుణ్ నేత్రావలికి ఉస్మానియా యూనివర్ సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది.
Read Also : దాయాది దేశంలో రికార్డు సృష్టించిన హిందూ యువతి…
ఆ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి మళ్లా డాక్టరేట్ ను ప్రధానం చేస్తుంది. ఇప్పటివరకూ ఉస్మానియా యూనివర్సిటీ 105 సంవత్సరాల చరిత్రలో 81 స్నాతకోత్సవాలు నిర్వహించింది.47 మందికి గౌరవ డాక్టరేట్లు అందించింది. ఓయూ నుంచి తొలి డాక్టరేట్‌ను 1917లో నవాబ్ జమాదుల్ ముల్క్ బహదూర్ అందుకున్నారు. ఆ తర్వాత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, సి.రాజగోపాలాచారి, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బీఆర్ అంబేద్కర్, డాక్టర్ వై.నాయుడమ్మ, డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి ప్రముఖులు ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ కు డాక్టరేట్ ప్రధానం చేయనుంది ఉస్మానియా యూనివర్సిటీ.
ఇవి కూడా చదవండి :
- గబ్బు చేస్తున్న పబ్బులు.. డీజే సౌడ్ మాటున అశ్లీల దందా..
- ఒక వైపు బుజ్జగింపు… మరో వైపు రాజీనామాకు డిమాండ్
- క్యాసినోలకు వెళతా… పేకాట ఆడతా.. ఏపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- మునుగోడుకు ఉపఎన్నిక వస్తే…. అధికార పార్టీలో మొదలైన భయం??
- భార్య కలెక్టర్‌గా పనిచేసిన జిల్లాకు భర్త కలెక్టర్‌గా బదిలీ… శుభాకాంక్షలు తెలిపిన భార్య..
One Comment