
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ ప్రతినిధి : ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలో 19 లోక్ సభ స్థానాలు ఒక పార్టీకి, ఆరు లో క్ సభ స్థానాలు మరొక పార్టీకి వస్తాయని చెప్పిందని, కాకపోతే పార్టీ పేర్లను మాత్రం తప్పు చెప్పిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను గమనిస్తే తెలుగుదేశం పార్టీకి 19 స్థానాలు, తమ పార్టీకి ఆరుస్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తమ పార్టీకి 19 లోక్ సభ స్థానాలు గెలవాలనే ఉంటుందన్న ఆయన, పార్టీని బలోపేతం చేసి 19 స్థానాలు గెలిచే విధంగా దృష్టి పెడితే బాగుంటుందన్నారు. ఇండియా టీవీ సర్వే ఫలితాలను చూసి వాన్ పిక్ జడ్జిమెంట్ చూసి ఆనంద పడినట్లుగా పడవద్దని హెచ్చరిక చేశారు.
Also Read : కేసీఆర్‌ను రాజకీయంగా ఓడగొట్టకపోతే తన జన్మకకు అర్థం లేదు.. ఈటల
శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ… వాన్ పిక్ కేసులో కోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉందన్నారు. కంపెనీ లా ప్రకారం… కంపెనీ ఇండివిజల్ వ్యక్తిగా అంటారు కానీ కంపెనీని శిక్షించలేరని, కాబట్టి ఆ పేరును తొలగించారన్నారు. వ్యక్తులు డైరెక్టర్గా డబ్బులు తీసుకున్న వారు సహకరించిన వారు కాబట్టి కేసులో ఉంటారన్నారు. వాన్ పిక్ స్థలాలలో అక్రమాలు జరిగాయని కేసు పెట్టినప్పుడు కంపెనీ వేరు, తప్పు చేసిన వ్యక్తులు వేరన్నారు. కోర్టు లో ట్రయల్స్ జరిగేటప్పుడు వ్యక్తులతో మాట్లాడి, వ్యక్తులు తప్పు చేశారని నిర్ధారణకు వచ్చిన తర్వాత వారిని శిక్షిస్తారని తెలిపారు. వాన్ పిక్ కేసులో ఆరవ నిందితునిగా పేర్కొన్న బ్రహ్మానంద రెడ్డి ఈ కేసు నుంచి తనని తప్పించాలని కోరగా, దానికి కోర్టు నిరాకరించిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. చట్టంలో కంపెనీని శిక్షించే ప్రొవిజన్ లేదు కాబట్టి, వాన్ పిక్ కేసు నుంచి వాన్ పిక్ కంపెనీ పేరును తొలగించారన్నారు.. అంతేకానీ ఇందులో సిబిఐ ఓడిపోయింది లేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచి, నిర్దోషిగా నిరూపణ అయింది లేదు అన్నారు. వాన్ పిక్ కేసులో బాధ్యులైన వారికి శిక్షలు తప్పకుండా ఉంటాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
Read Also : తెరాసకు షాక్… సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్ రాజీనామా
న్యాయ శాస్త్రం తిరగరాసే తీర్పు ఇస్తారనుకోవడం లేదు
ఆర్థిక నేరాల అభియోగం కేసులలో కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు నివ్వాలని కోరుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై త్వరలోనే తీర్పు వెలువడే అవకాశం ఉన్నదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయితే ఈ కేసులో కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపునిస్తూ, న్యాయ శాస్త్రాన్ని తిరగరాసే తీర్పు ఇస్తారని తాను అనుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సిందేనని, ఇప్పటికే ఆరు నెలల సమయం పూర్తయినందున స్వాతంత్ర దినోత్సవం నాటికి ఈ కేసు తీర్పు వెలువడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావలసిన అవసరం లేదని తీర్పు వస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో పైకోర్టుకు వెళ్ళవలసి వస్తుందన్నారు.
Also Read : పాండవులు, కౌరవుల మధ్యే ఎన్నికలు… రాజగోపాల్ రెడ్డి
కొత్తగా చేసిందేమీ లేకపోయినప్పటికీ… ఏదో చేశామని వినూత్న ప్రచారమే చేసుకోవడమే
గత ప్రభుత్వాల కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేకపోయినప్పటికీ, ఏదో చేశామని వినూత్న ప్రచారం చేసుకుంటున్నదని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా , చరిత్రలో ఏనాడు లేని విధంగా కాపులందరికీ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన పత్రికలు, చానల్స్ ద్వారా కాపులను మోసగించారని పేర్కొనడం గా ఉందని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు సొంతంగా పత్రికలు, చానల్స్ లేవన్న ఆయన, తమకు మాత్రం సాక్షి దినపత్రిక, చానల్ ఉన్నదని చెప్పారు. అయితే సాక్షి ఛానల్ త్వరలోనే మూత బడడం ఖాయమని తెలిపారు. సాక్షి ఛానల్ మూతబడిన, భగవంతునికి భక్తునికి అంబికా దర్బార్ బత్తి అనుసంధానం అన్నట్టుగా, ఏపీలో ఫైబర్ నెట్ ద్వారా చైర్మన్ గౌతమ్ రెడ్డి చానల్ ను ప్రారంభిస్తున్నారని తెలిపారు. భగవంతుడైన జగన్మోహన్ రెడ్డికి, భక్తులైన ప్రజలకు సాక్షి ఛానల్ లేని లోటును తీర్చ నున్నారని అపహాస్యం చేశారు. ఇప్పటికే అంకెలు, అక్షరాలతో కూడిన చానల్స్ కొన్ని ఆయనకు అండగా ఉన్నాయని, వ్యక్తి పూజ చేయని కొన్ని చానల్స్ మాత్రమే ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నాయని తెలిపారు.
Read Also : భారత సీజేఐ ఎన్వీ రమణకు ఓయూ డాక్టరేట్ ప్రధానం…
కాపు నేస్తం పథకం ద్వారా ఐదు సంవత్సరాలకు 75 వేల రూపాయలు అందజేసిన, జగనన్న చేయూత పథకం ద్వారా నాలుగు సంవత్సరాలకు 74 వేల రూపాయలు అందజేసిన వడ్డీలో తేడా ఉంటుంది తప్ప, లబ్ధిలో పెద్దగా తేడా ఉండదన్నారు. రెండు పథకాలు ఒక్కటేనని, కాకపోతే పేరులే తేడానని చెప్పారు. కాపులకు ప్రత్యేకించి ఏదో చేసినట్టు కనబడాలని ఉద్దేశంతోనే, బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. వైయస్సార్ చేయూత పథకం కిందనే కాపు ,తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి లబ్ధి చేకూర్చ వచ్చునని పేర్కొన్నారు. జగనన్న కాపు చేయుత, రెడ్డి చేయూత, క్షత్రియ చేయుత మాదిరిగానే బీసీలలో కులానికి ఒక చేయుత పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. దానితో రోజుకు ఒక బటన్ నొక్కుతూ, నగల కొట్టు ల యాడ్లు లేని రోజుల్లో, సాక్షి దినపత్రికలో ప్రకటనలను వేసుకోవచ్చు నని దేవా చేశారు. కాపులకు 35 నుంచి 36 వేల కోట్ల లబ్ధి చేకూర్చానన్న జగన్మోహన్ రెడ్డి, ఇందులో నేరుగా 16 నుంచి 17 వేల కోట్లు, ఇక ఇళ్ల స్థలాల కేటాయింపుల ద్వారా 16 నుంచి 17 వేల కోట్ల రూపాయల లబ్ధిని చేకూర్చాలని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి కాపుల కోసమే చేసింది ఏమీ లేదని, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇవ్వాల్సిందేనన్నారు. వృద్ధ కాపులకు ప్రత్యేకించి పింఛన్ ఇవ్వడం లేదు కదా అని ప్రశ్నించారు. సమాజాన్ని తానే ఉద్ధరిస్తున్నట్లు, కాపు జనోద్ధారకుడైన జగన్మోహన్ రెడ్డి తాను కాపుల కోసం 34 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పగానే, వేదిక మీద ఉన్న కాపు మంత్రులు, ప్రజా ప్రతినిధులు చప్పట్లు కొట్టి ఆనంద పడడం విడ్డూరంగా ఉందని రఘురామ మండిపడ్డారు. ఇక నిజాలు రాసే రెండు పత్రికలు, మూడు చానల్స్ పై, ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఏదో మంచి చేయాలని తపన పడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును విమర్శించడం జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారిందన్నారు.
Also Read : తెరాసకు షాక్… సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్ రాజీనామా
ప్రతిపక్షాలకు మనమే అధికారాన్ని అప్పగిస్తున్నామా?
ప్రతిపక్షాలకు బంగారు పళ్లెంలో పెట్టి అధికారాన్ని మనమే అప్పగించబోతున్నామా?, మన మీటింగ్ లే మనకు ఎదురు దెబ్బలు తగిలేలా చేస్తున్నాయా?? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ముక్కోటి దేవతలంతా ఏకమై మానవాళికి మంచి చేయడానికి తనని సృష్టించినట్లుగా జగన్మోహన్ రెడ్డి తనకు తానే ఊహించుకుంటున్నారని ఆయన విమర్శించారు.. వైయస్సార్ జగనన్న ఆసరా పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు 25 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే, గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఒకసారి, పసుపు కుంకుమ కింద పదివేల రూపాయల చొప్పున మరొకసారి 23 నుంచి 24 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో అప్పు చేసిన డ్వాక్రా మహిళలకు మాత్రమే లబ్ధి చేకూరగా, గత ప్రభుత్వ హయాంలో అప్పు చేసిన చేయకపోయినా డ్వాక్రా మహిళలందరికీ లబ్ధి చేకూరిందని తెలిపారు. తాను ఇలాగ మాట్లాడితే చంద్రబాబు నాయుడుకి మద్దతునిస్తున్నానని అంటారని, కానీ తాను నిజాలను మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు 25 వేల కోట్ల రూపాయలు కాకుండా, లక్షా, రెండు లక్షల కోట్ల రూపాయలు అందజేశామని లెక్కలతో సహా చెబితే, తన లెక్కలు సరి చేసుకుంటానని తెలిపారు.
Read Also : దాయాది దేశంలో రికార్డు సృష్టించిన హిందూ యువతి…
ఈ నిర్ణయం ఎవరికోసమో?
రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ను ఎత్తివేయాలన్న నిర్ణయం ఎవరికోసమో తనకైతే అర్థం కావడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానాన్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టగా అందరూ కొనసాగించారని, నిరంతరం దళితుల కోసం పరితపిస్తూ, వారి కళ్ళల్లో వెలుగులు చూడాలనుకునే జగన్మోహన్ రెడ్డి ఈ విధానాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, దాన్ని ఎత్తి వేస్తున్న కూడా ఎవరు ప్రశ్నించకపోవడం దౌర్భాగ్యం అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టుకున్న వారు కూడా ప్రశ్నించకపోగా, ప్రశ్నించిన వారిని కాళ్లు కట్టేసి కొట్టడమే కాకుండా, రకరకాల కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇప్పటికీ ఏదో ఒక కేసుల అరెస్టు చేయాలని చూస్తున్నారని రఘురామకృష్ణం రాజు విరుచుకు పడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే ఎన్నో పథకాలు ఉండేవన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను స్వయం ఉపాధి కోసం ప్రోత్సహించే వారిని తెలిపారు. లక్ష మందికి 10000 ఇచ్చే దానికి బదులు, 20వేల మందికి లక్ష రూపాయల చొప్పున అందజేస్తే వారు తమ కాళ్ళపై నిలబడే అవకాశం ఉంటుందన్నారు. అంతేకానీ కాళ్లు విరగ్గొట్టి అన్నం పెడతామనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
Also Read : గబ్బు చేస్తున్న పబ్బులు.. డీజే సౌడ్ మాటున అశ్లీల దందా..
ఎన్జీవో స్థాపించవచ్చా?
1955 ఐపీఎస్ ఐఏఎస్ సర్వీస్ రూల్స్ ప్రకారము ఐపీఎస్ ఐఏఎస్ విధులను నిర్వహించేవారు ఎవరు కూడా ఇతర కార్యక్రమాలలో పాల్గొనరాదని, ప్రత్యేకించి ఎన్జీవో లాంటి సంస్థలను నడుపుతూ విరాళాలను సేకరించవద్దని స్పష్టంగా పేర్కొనడం జరిగిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను ఇదే విషయమై డి ఓ పి టి కి ఫిర్యాదు చేశాన ని, కానీ ఇప్పటివరకు సమాధానం లభించలేదన్నారు.
ఇవి కూడా చదవండి :
- ఖమ్మం పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి….
- ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధికే వైసీపీ మద్దతు….
- తెలుగుదేశం పార్టీలో అంతర్గత సర్వే….. ఈసారి ఎన్ని సిట్లంటే….