
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దాయాది దేశం పాకిస్తాన్ లో మన హిందూ యువతి రికార్డు సృష్టించింది. అసలే ముస్లీ దేశం.. లో హిందువులకే స్థానంలేని పాకిస్తాన్ ఓ హిందూ యువతికి ఆదేశ పోలస్ డిపార్ట్ మెంట్ లో అత్యున్న స్థానాన్ని కల్పించింది. ఇదినమ్మలేని జంగానే కనిపిస్తున్నా.. కలలాంటి ఈ నిజాన్ని నమ్మకతప్పదు. ఇక వివరాల్లోకి వెళ్లితే.. సింధు ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన మనీషా రూపేటా పోలీస్ శాఖలో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఫలితంగా ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా రికార్డుసృష్టించారు. 2019లో మనీషా సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి 16వ ర్యాంకు సాధించారు.
Also Read : ఒక వైపు బుజ్జగింపు… మరో వైపు రాజీనామాకు డిమాండ్
డీఎస్పీగా ఎంపికైన మనీషా మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. తనకు పోలీసు ఉద్యోగమంటే ఎంతో ఇష్టమని తెలిపారు. పోలీసు ఉద్యోగానికి ఎంతగానో కష్టపడాల్సి వచ్చిందన్నారు. తాను డీఎస్పీ కావడంతో తమ కమ్యూనిటీ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేసారు. మహిళలకు టీచర్, డాక్టర్ ఉద్యోగాలు మంచిదని, పురుషులు ఎక్కువగా ఉండే పోలీసు శాఖలో మహిళలు ఇమడలేరనే అపవాదును తుడిచి పెట్టాలనే ఆశయంతోనే డీఎస్ పీ ఉద్యోగాన్ని సాధించానన్నారు.
Read Also : మునుగోడుకు ఉపఎన్నిక వస్తే…. అధికార పార్టీలో మొదలైన భయం??
మరోవైపు మహిళలపై వేధింపులు, నేరాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన మనీషా.. వారికి రక్షణగా ఉండాలన్న ఉద్దేశంతోనే పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. ఉన్నత కుటుంబాల్లోని మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లరన్న భావన ఉందని, ఇది మారాలని అన్నారు. సాధారణంగా పాకిస్థానీ మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లరని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే కుటుంబంలోని వ్యక్తిని తీసుకుని వెళ్తారని అన్నారు. కాగా, పాకిస్థాన్‌లో డీఎస్పీగా ఎంపికైన హిదూ యువతి మనీషాను అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- క్యాసినోలకు వెళతా… పేకాట ఆడతా.. ఏపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని ఉద్యోగులకు నోటీసులు.. విమర్శలు రావడంతో వెనక్కి
- ఖమ్మం పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి….
- భార్య కలెక్టర్‌గా పనిచేసిన జిల్లాకు భర్త కలెక్టర్‌గా బదిలీ… శుభాకాంక్షలు తెలిపిన భార్య..
- బీ.ఎస్.ఎన్.ఎల్ కు భారీ నిధులను కేటాయించిన కేంద్రం…
One Comment