

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అలనాటి స్టార్ హీరోయిన్, సహజ నటి జయసుధ టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అడపాదడపా సినిమాలు చేస్తున్న ఆమె హీరోయిన్ల వివక్షపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో లోపాలను బయటపెట్టారు. ఐదు దశాబ్దాలపాటు చిత్ర పరిశ్రమలో తిరుగులోని నటిగా రాణించారు జయసుధ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగారు. ఎన్టీఆర్,ఏఎన్నార్, శోభన్‌బాబు వంటి మొదటితరం హీరోలతో కలిసి నటించి ఆడిపాడారు. అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అనేక సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచారు. అయితే ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే చేస్తున్నారు. సహజనటిగా పేరుతెచ్చుకున్న ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, నటిగా రంగులేసుకుని యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది ఐదు దశాబ్దాల సుధీర్ఘ కెరీర్లో అనేక మైళ్లు రాళ్లు అదిగమించి ఇండస్ట్రీలో సక్సెస్‌లో తనూ ఓ భాగమయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఒక టాక్ షోలో పాల్గొన్నారు. ఇందులో అనేక సంచలన విషయాలను వెల్లడించారు. హీరోయిన్లపై ఉన్న వివక్ష గురించి మాట్లాడారు.
Read Also : కేసీఆర్‌ను రాజకీయంగా ఓడగొట్టకపోతే తన జన్మకకు అర్థం లేదు.. ఈటల
తాను స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా హీరోలతో పోల్చితే హీరోయిన్లపై వివక్ష ఉందన్నారు. ముంబయి హీరోయిన్ అయితే బెటర్ అని, బాంబే నుంచి హీరోయిన్ వస్తే ఆమె కుక్కలకు కూడా స్పెషల్ రూమ్లిస్తున్నారని ఇండస్ట్రీపై, మేకర్స్ పై హాట్ కామెంట్ చేశారు. తెలుగు హీరోయిన్లపై చిన్న చూపు ఉంటుందన్నారు. అదే సమయంలో `పద్మశ్రీ`లాంటి అవార్డులకు మేము పనికిరామా అంటూ ఘాటుగా స్పందించారు. ఇటీవల కంగనారనౌత్కి `పద్మశ్రీ` పురస్కారం ఇచ్చిన నేపథ్యంలో ఆమెతో ప్రభుత్వానికి ఏం అవసరం ఉందో అంటూ సంచలనాలకు తెరలేపారు. తన ఎన్నేళ్ల కెరీర్లో ఎప్పుడైనా ఎక్కువగా డిమాండ్ చేసినా, ఎక్కువగా ఇబ్బంది పెట్టినా, ఇన్నేళ్లు నటిగా ఇండస్ట్రీలో ఉండనిచ్చే వారుకాదని, ఎప్పుడో పంపించేవారని అన్నారు జయసుధ. డామినేషన్ అనేది హీరోల్లో ఉండదని, కానీ వారి పక్కన ఉన్న వాళ్లతోనే అసలు సమస్య అని తెలిపారు. యాభై ఏళ్ల సినీ ప్రస్తానం గురించి చెబుతూ, నటిగా సక్సెస్‌ఫుల్‌గా 50ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్లో అయితే ఫ్లవర్ బొకేలైనా పంపించేవారని, ఇక్కడ కనీసం అదికూడా లేదని, అదే హీరో అయితే పెద్ద హడావుడి జరిగేదని తెలిపింది.
Also Read : పాండవులు, కౌరవుల మధ్యే ఎన్నికలు… రాజగోపాల్ రెడ్డి
శోభన్‌బాబుని గుర్తు చేసుకున్న జయసుధ.. ఆయన తనని `ఏమోయ్` అని పిలిచేవారట. ఆయన దగ్గర్నుంచి డబ్బు సేవ్ చేసుకోవడం నేర్చుకోలేకపోయానని తెలిపింది. అయితే శోభన్‌బాబు చాలా సార్లు `నీకొక ప్లేస్ చూపిస్తాను. మీ నాన్నగారితో చెప్పి కొనుక్కో` అని చెప్పేవారట. అదే సమయంలో సావిత్రి గారి `మహానటి` అప్పుడు తీసి ఉంటే బాగుండేదన్నారు జయసుధ. `మా` ఎన్నికలపై జయసుధ రియాక్ట్ అవుతూ, అమెరికా వెళ్లే ముందు ఇక్కడ `మా` ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ గోల భరించలేకే, ఒక నెల అక్కడే ఉండిపోయానని చెప్పింది. `మా` ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయకుండా ఇంకెవరికి చేస్తుంది అని మోహన్‌బాబు అన్నదాని గురించిచెప్పాలంటే నా 50 ఏళ్ల సినీ కెరీర్ అంత ఉంటుందని చెప్పింది సహజనటి. `మా` బిల్డింగ్‌పై ఆమె మాట్లాడుతూ, `మురళీ మోహన్ టైమ్ నుంచి బిల్డింగ్ కడతామని చెబుతున్నారు. ఇంత వరకు కట్టలేరు. ఇంకో 25ఏళ్ల కెరీర్ ఉంటే అప్పటికైనా `మా` భవనం కడతారని ఆశిస్తున్నా` అని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- తెరాసకు షాక్… సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్ రాజీనామా
- భారత సీజేఐ ఎన్వీ రమణకు ఓయూ డాక్టరేట్ ప్రధానం…
- దాయాది దేశంలో రికార్డు సృష్టించిన హిందూ యువతి…
- గబ్బు చేస్తున్న పబ్బులు.. డీజే సౌడ్ మాటున అశ్లీల దందా..
- ఒక వైపు బుజ్జగింపు… మరో వైపు రాజీనామాకు డిమాండ్
The next time I read a blog, I hope that it does not fail me just as much as this one. I mean, I know it was my choice to read, but I really thought youd have something useful to say. All I hear is a bunch of crying about something you could fix if you were not too busy seeking attention.