
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ ప్రతినిధి : రోజు రోజు పార్టీ కల్చర్ హంగామా ఎక్కువైపోతోంది. యువత కొత్తపుంతలు తొక్కుతూ.. పెడదారి పడుతోందని ఇప్పటికే కొంతమంది వాదిస్తున్నారు. ఇక ప్రధాన నగరాల్లో పబ్బులు అరాచకం చాలా ఎక్కువైపోతున్నాయి. హైదరాబాద్ లోని పబ్బుల్లో జరుగుతున్న అరాచకాలు నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. జల్సాలకు అలవాటు పడిన యువతను ఆకర్షిస్తూ కొంతమంది గలీజ్ దందాలను నడిపిస్తున్నారు. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసినా కొన్ని పబ్బుల నిర్వాహకులు మాత్రం వాటిని పట్టించుకోకుండా పబ్బుల్లో డ్రగ్స్ వాడుతూ నానా రచ్చ చేస్తు అరాచలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ పబ్ గలీజు దందాకు తెరలేపింది.
Read Also : ఒక వైపు బుజ్జగింపు… మరో వైపు రాజీనామాకు డిమాండ్
హైదరాబాద్ కేపీహెచ్‌బీ లోని ఓ పబ్ అశ్లీల దందా నడిపిస్తు గలీజ్ దందాకు తెరలేపింది కేపీహెచ్‌బీలోని క్లబ్ మస్తీ పబ్. పోలీసులు పలుమార్లు దాడులు చేసినా క్లబ్ మస్తీ వ్యవహారం మారలేదు. ఇప్పటికే ఈ పబ్ పై పోలీసులు చాలా సార్లు దాడి చేశారు. ఆయినా కూడా క్లబ్ మస్తీ వ్యవహారం మార్చుకోవడం లేదు. పబ్ చాటున పెద్ద అశ్లీల దందా నడిపిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు చెవులు చిల్లులు పడేలా డీజే సౌండ్స్‌తో అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. చుట్టుప్రక్కల వారు కంప్లెయింట్ చేసిన కూడా క్లబ్ మస్తీ నిర్వాహకులు తమ తీరు మార్చుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- క్యాసినోలకు వెళతా… పేకాట ఆడతా.. ఏపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని ఉద్యోగులకు నోటీసులు.. విమర్శలు రావడంతో వెనక్కి
- ఖమ్మం పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి….
- భార్య కలెక్టర్‌గా పనిచేసిన జిల్లాకు భర్త కలెక్టర్‌గా బదిలీ… శుభాకాంక్షలు తెలిపిన భార్య..
- బీ.ఎస్.ఎన్.ఎల్ కు భారీ నిధులను కేటాయించిన కేంద్రం…
- మునుగోడుకు ఉపఎన్నిక వస్తే…. అధికార పార్టీలో మొదలైన భయం??
- అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలో కోమటిరెడ్డి! గంటకో ట్విస్ట్ తో రాజకీయ రచ్చ..