
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లాకు జెండా పండుగ ముందే వచ్చింది. ఏఇంట్లోకి వెళ్లిన మూడు రంగుల జెండాలే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల కుట్టు మిషన్లపై, మరికొన్ని చోట్ల కత్తిరిస్తూ, ప్యాకింగ్ చేస్తూ ఎవరి పనులలో వారు నిమగ్నం కావడంతో సందడి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా గత 20 రోజులుగా ఇతర రాష్ట్రాలకు రోజుకు లక్ష మీటర్ల జాతీయ జెండాలు తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ సుమారు 1000 మందికి పైగా పురుషులు, మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆయా కొలతల పరంగా ఒక్కో జెండా తయారీకి 5 రూపాయల నుండి 8 రూపాయల వరకు ఖర్చవుతుంది. జెండాలు, కండువాలు కత్తిరించడం, మిషన్లపై కుట్టడంతో ఒక్కో మహిళ రోజుకు 300 రూపాయలు సంపాదిస్తున్నారు. వారి ఇతర పనులకు తోడుగా ఇది అదనపు ఉపాధి లభిస్తుంది. సిరిసిల్లలో నిత్యం 30 లక్షల మీటర్ల పాలిస్టర్ తెలుపు వస్త్రం ఉత్పత్త జరుగుతుంది. ఇది జెండాలు, కండువాల తయారీకి అనువైంది.
Also Read : అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలో కోమటిరెడ్డి! గంటకో ట్విస్ట్ తో రాజకీయ రచ్చ..
75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రతి ఇంటికి జాతీయ జెండా పంపిణి చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. వస్త్ర సేకరణ, జెండాల తయారీ బాధ్యతలను టెస్కోకు అప్పగించింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నుండి పాలిస్టర్ వస్త్రాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. టెస్కో మీటరుకు 11 రూపాయలు నిర్ణయించగా, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘము 13 రూపాయలు ఇవ్వలని డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ధరల విషయం కొలిక్కి వస్తే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేరుగా పరిశ్రమల నుండి సేకరించి, వస్త్రాన్ని మిల్లులకు తరలించి, అక్కడ జెండా రంగులను అద్ది, వివిధ కొలతల్లో సిద్ధం చేసి నేరుగా జిల్లా, మండల కేంద్రాలకు సరఫరా చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
- మునుగోడుకు ఉపఎన్నిక వస్తే…. అధికార పార్టీలో మొదలైన భయం??
- ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్న ప్రజాప్రతినిధులు
- వెక్కిరిస్తూ… వెల్కమంటున్న హాస్టల్…!!
- మూడు నెలల క్రితం MLA స్టిక్కర్ పడేశాడట!.. మంత్రి మల్లారెడ్డి కవరింగ్ అదుర్స్..
- ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారు? పీకే టీమ్ తుది నివేదిక ఇచ్చిందా? అసెంబ్లీ రద్దు అప్పుడేనా?
- రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ ఫోన్… ఢిల్లీకి రావాలని పిలుపు
One Comment