
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భార్యాభర్తలిద్దరూ ఐఏఎస్‌లే. వ్యక్తిగత జీవితంలో ఆలుమగలైన వారిద్దరికీ వృత్తిపరంగా ఒక అరుదైన పరిణామం ఎదురైంది. భార్య కలెక్టర్‌గా పనిచేసిన జిల్లాకు భర్త కలెక్టర్‌గా వెళ్లారు. ఆయన భార్య మరో జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అలప్పుజ కలెక్టర్‌గా పనిచేసిన రేణూ రాజ్ అనే మహిళా ఐఏఎస్ అధికారి తన జిల్లా బాధ్యతలను ఆమె భర్త శ్రీరామ్ వెంకట్రామన్‌కు అప్పగించారు. ఇన్నాళ్లూ తాను కూర్చున్న జిల్లా కలెక్టర్ సీటులో కూర్చునేందుకు రేణూ రాజ్ తన భర్తను ఆహ్వానించారు. ఆయన అలప్పుజ కలెక్టర్ స్థానంలో కూర్చోగానే శుభాకాంక్షలు తెలుపుతూ కరచాలనం చేశారు. తాను కలెక్టర్‌గా పనిచేసిన జిల్లాను సుభిక్షంగా చూసుకోవాలని భర్తను కోరుతూనే, అలప్పుజ జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
Also Read : ముందే వచ్చిన జెండా పండుగ….
ఇదిలా ఉండగా.. అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా శ్రీరామ్ వెంకట్రామన్ పోస్టింగ్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం వెలుపల నిరసనకు దిగారు. వెంకట్రామన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక రోడ్డు ప్రమాదం కేసులో అరెస్ట్ అయి, సస్పెండ్ అయిన వ్యక్తికి తమ జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఎలా ఇస్తారంటూ నిరసనకు దిగిన వారు నిలదీశారు. 2019లో వెంకట్రామన్ తన స్నేహితురాలు వాఫా ఫిరోజ్‌తో (కారు ఈవిడే డ్రైవింగ్ చేసింది) కలిసి కారులో హై స్పీడ్‌లో వెళుతుండగా కారు అదుపు తప్పి టూ-వీలర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో అరెస్ట్ అయి, సస్పెండ్ అయిన వెంకట్రామన్ 2020లో మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు.
Read Also : బీ.ఎస్.ఎన్.ఎల్ కు భారీ నిధులను కేటాయించిన కేంద్రం…
ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆయన అలప్పుజ జిల్లాకు కలెక్టర్‌గా ఎలా వస్తారంటూ ఆ జిల్లా కేరళ కాంగ్రెస్ నిలదీసింది. అతని పోస్టింగ్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, జిల్లా కలెక్టర్ అంటే జిల్లా మేజిస్ట్రేట్‌తో సమాన హోదా కలిగిన వ్యక్తి అని.. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ప్రజలకు న్యాయం ఎలా చేస్తారని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేరళ కేడర్‌కు చెందిన ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు డాక్టర్లు కూడా కావడం గమనార్హం. ఈ ఏప్రిల్‌లోనే వీరిద్దరికీ వివాహమైంది.
ఇవి కూడా చదవండి :
- మునుగోడుకు ఉపఎన్నిక వస్తే…. అధికార పార్టీలో మొదలైన భయం??
- అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలో కోమటిరెడ్డి! గంటకో ట్విస్ట్ తో రాజకీయ రచ్చ..
- ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్న ప్రజాప్రతినిధులు
- వెక్కిరిస్తూ… వెల్కమంటున్న హాస్టల్…!!
- మూడు నెలల క్రితం MLA స్టిక్కర్ పడేశాడట!.. మంత్రి మల్లారెడ్డి కవరింగ్ అదుర్స్..