
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సమాచార రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న బీఎస్ ఎన్ ఎల్ ల్లో నిర్వహణా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తునే వున్నాయి. తాజాగా తెరమీదకు వచ్చిన బ్రాండెడ్ కంపెనీలను తట్టుకుని మనుగడ సాగించే ప్రయత్నంలో బీఎస్ ఎన్ ఎల్ పూర్తి గా వెనకబడిపోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కనుమరుగు కాబోతుందేమో అనే అనుమానాలు ప్రజల్లో బలంగా నాటుకు పోయాయి.
Also Read : మునుగోడుకు ఉపఎన్నిక వస్తే…. అధికార పార్టీలో మొదలైన భయం??
పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్ కు తిరిగి ప్రాణం పోసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఎస్ ఎన్ ఎల్ పునరుద్ధరణకు భారీ ప్యాకేజీ ప్రకటించి వినియోగ దారులకు షాకిచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓ దశలో కనుమరుగు కాబోతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో బీఎస్ఎన్ఎల్ కు ఏకంగా రూ.1.64 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Read Also : అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలో కోమటిరెడ్డి! గంటకో ట్విస్ట్ తో రాజకీయ రచ్చ..
మరోవైపు బీఎస్ఎన్ఎల్‌లో భారత్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్ బీబీఎన్ఎల్‌ను విలీనం చేసేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ రెండు సంస్థల విలీనం తర్వాత దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా 4జీ నెట్‌వర్క్ సదుపాయాన్ని కల్పించే దిశగా బీఎస్ఎన్ఎల్ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- మూడు నెలల క్రితం MLA స్టిక్కర్ పడేశాడట!.. మంత్రి మల్లారెడ్డి కవరింగ్ అదుర్స్..
- ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారు? పీకే టీమ్ తుది నివేదిక ఇచ్చిందా? అసెంబ్లీ రద్దు అప్పుడేనా?
- ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్న ప్రజాప్రతినిధులు
- వెక్కిరిస్తూ… వెల్కమంటున్న హాస్టల్…!!
- ముందే వచ్చిన జెండా పండుగ….