
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో(క్రైమ్ మిర్రర్) : కుమురం భీం జిల్లా కేంద్రం నుంచి ఎక్స్ రోడ్డు నుండి కాగజ్ నగర్ పెద్దవాగు వరకు గత తొమ్మిది నెలలుగా రోడ్డు నిర్మాణంలోనే ఉంది. దాని ద్వారా ఎండాకాలములో దుబ్బతో, వానాకాలంలో బురదతో ఆ రహదారి నిండి ఉంటుంది. గతంలో జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్యేలకు విన్నవించిన వారు పట్టించుకోవడం లేదు. రహదారి పైన రాత్రి సమయమైన, పగలైనా నడవాలంటే ప్రజలు నరకయాతన పడాల్సి వస్తుంది. దానితో ప్రజలను చైతన్యం చేసి ప్రజా సంఘాలు డివైఎఫ్ఐ, కెవిపిఎస్, ఎస్ఎఫ్ఐ, సిఐటియు, ఐద్వా గిరిజన సంఘo కలిసి ఎక్స్ రోడ్డు వద్ద చెడిపోయిన రోడ్డు మీద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలిసిన అధికారులు ప్రజా ప్రతినిధులు రోడ్డును బాగు చేయడంలో విఫలం అయ్యారు.
Also Read : మూడు నెలల క్రితం MLA స్టిక్కర్ పడేశాడట!.. మంత్రి మల్లారెడ్డి కవరింగ్ అదుర్స్..
నిత్యం ఏదో ఒక పని మీద జిల్లాలో అధికారులు ఈ రోడ్డు మీదుగా వెళ్తుంటారు కానీ వారికి ప్రజల ప్రాణాలు లెక్కలేదు. ఇక జిల్లా ప్రజా ప్రతినిధుల పని తీరు చూస్తే వాళ్ళు వోట్ లకు దండం పెడతారు సమస్య వచ్చే సరికి తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే లు వెంటనే రోడ్డు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. ధర్నా ఉదృతం కావడంతో రెబ్బెన ఎస్సై మరియు డి.ఈ వచ్చి త్వరలోనే రోడ్డుని బాగు చేయిస్తామని పూర్తి హామీ ఇవ్వడంతో ధర్నా సద్దుమరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు సి.ఐ.టి.యూ జిల్లా ఉపాధ్యక్షులు ముంజ ఆనంద్, డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొర్కుటె శ్యాం రావు, గొడిసెల కార్తీక్, సిపీఎం జిల్లా కార్యదర్శి కుశన, రాజన్న, సి.ఐ.టి.యూ జిల్లా అధ్యక్షలు అల్లూరి లోకేష్, కె.వి.పి.ఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్,
ఏ.ఐ.డి.డబ్ల్యూ.ఓ జిల్లా కార్యదర్శి దుర్గం అనిత, టి.ఏ.జి.ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారు? పీకే టీమ్ తుది నివేదిక ఇచ్చిందా? అసెంబ్లీ రద్దు అప్పుడేనా?
- ఫిలిప్పీన్స్ ఉత్తర భాగంలో భారీ భూకంపం…
- రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ ఫోన్… ఢిల్లీకి రావాలని పిలుపు
- నదిలో దంపతుల మృతదేహాలు లభ్యం….