
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాండూరు పరిధిలోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగ్నా నది పరివాహక ప్రాంతంలోని మంత్తట్టి గ్రామానికి చెందిన నాటుకేరి బుగ్గప్ప, నాటుకేరి యాదమ్మ దంపతులు మంగళవారం నదిలో గల్లంతయ్యారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని సులాయిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వ్యవసాయ భూమిలో సాగు చేసి ఇంటికి తిరిగి వస్తున్న దంపతులు నదిని దాటాల్సి ఉండగా, ఇంటికి చేరుకోవడానికి కాగ్నా నదిని దాటుతుండగా నీటి ఉధృతికి కొట్టుకుపోయారని సమాచారం.
Also Read : విశాఖ వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. ప్రియుడితో నెల్లూరులో ప్రత్యక్షం
తల్లిదండ్రులు ఇంటికి రాకపోవడంతో దంపతుల కుమారుడు ఫిర్యాదు చేశాడు. బుధవారం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని సులైపట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మృతదేహాలు ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కర్నాటక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి బషీరాబాద్ మండల గ్రామస్తులకు సమాచారం అందించారు. ఆ తర్వాత మంత్తట్టి గ్రామానికి చెందిన నాటుకేరి బుగ్గప్ప, నాటుకేరి యాదమ్మ మృత దేహం. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి :
- జంట జలాశయాల్లోకి పెరుగుతున్న వరద ప్రవాహం
- ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధికే వైసీపీ మద్దతు….
- రాజగోపాల్ రెడ్డి చేరికపై క్లారిటీ ఇచ్చిన బండి…
- అక్రమ వెంచర్, నక్ష బాట కబ్జాపై కలెక్టర్ కి పిర్యాదు…
- తెలుగుదేశం పార్టీలో అంతర్గత సర్వే….. ఈసారి ఎన్ని సిట్లంటే….