
క్రైమ్ మిర్రర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లా అతలాకుతం అవుతుంది. పట్టణాలు, గ్రామాలే కాక పంటలు సైతం నీట మునగడంతో రైతులు ఆందోళనతో తలలు పట్టుకుంటున్నారు.జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలు, పంటలు కొట్టుపోతున్న పరిస్థితి. పంట మొత్తం నీటి మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో రాత్రంతా నీటిని బయటకు తోడుతూ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. మరికొన్ని గ్రామాలు, పట్టణాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయాయి.
Also Read : అక్రమ వెంచర్, నక్ష బాట కబ్జాపై కలెక్టర్ కి పిర్యాదు…
రాజీవ్ గృహకల్పలో ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు…
జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప ప్రజల పరిస్థితి మారిగోరంగా ఉంది. పొలాల్లో నుండి వచ్చిన నీళ్లు మొత్తం ఇండ్లలోకి చేరడంతో వారి గోస వర్ణనాతీతంగా మారింది. గర్భిణీ స్త్రీలు సైతం రాత్రంతా నీటిలోనే నిలబడిన దుస్థితి. ఈ పరిస్థితి చూసి చలించిన మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అక్కడికి వెళ్లి రాజీవ్ గృహకల్ప బాధితులకు భరోసా కల్పించారు. ఈ సమస్య మరొకసారి రాకుండా శాశ్వత పరిష్కారం చెపుతామని హామీ ఇచ్చారు.
Read Also : కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే పదవి సేఫ్! అందుకే రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి ఫైర్
వాగులు, చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్…
భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగుల వద్ద జాలర్లను,ప్రజలను అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులు ఆదేశించారు.మంగళవారం జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంజనీరింగ్, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ చెరువుల వద్ద పొంగిపొర్లుతున్న వాగుల వద్ద ప్రజలు గుమ్మికూడకుండా ఇళ్లల్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాద దశలో ప్రవహిస్తున్న గ్రామాల చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకూడదని చాటింపు, మైకుల ద్వారా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 24 రోడ్ల పరిధిలలో 31 స్థలాల్లో అధికంగా నీరు ప్రవహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Also Read : ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఊహించని వరద.. హైదరాబాద్ కు పెను గండమే!
దోర్నాల బ్రిడ్జి పనుల్లో దొంగలు పడ్డారు..
వికారాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు, వంతెనల నిర్మాణ పనులు నల్లేరు మీద నడకలా కొనసాగుతున్నాయి.ముఖ్యంగా వికారాబాద్ నుండి తాండూర్ వెళ్లి మార్గంలో నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులు ఏళ్ళు గడిచినా పూర్తి కాక, వర్షాకాలం వచ్చిందంటే వెళ్ళడానికి దారిలేక నరకయాతన అనుభవిస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిలో ధారూర్ మండలం దోర్నాల బ్రిడ్జికి ఘన చరిత్ర ఉంది. ఏళ్ళు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాకపోగా, వర్షాకాలం వచ్చినప్పుడే జిల్లా కలెక్టర్, మంత్రులు అక్కడికి వెళ్లి వెంటనే పూర్తికావాలని ఆదేశాలు జారీచేయడం, నెల, రెండు నెలలు తూతూ మంత్రంగా పనులు ప్రారంభించడం మళ్లీ నిలిపివేయడం, మళ్లీ వర్షాకాలం వచ్చి చేసిన నిర్మాణ పనులు మొత్తం వరదలో కొట్టుకుపోవడం ఇదే తంతూ.
Also Read : “కాళేశ్వరం అవినీతిపై హైకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి”
దాంతో ఇక్కడి ప్రజలు దోర్నాల బ్రిడ్జి పనుల్లో దొంగలు పడ్డారని, బిల్లులు లేపుకోవడం డబ్బులు దోచుకోవడం దాచుకోవడం, నిర్మాణ పనులు గాలికి వదిలేయడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక స్థానిక ప్రజా ప్రతినిధుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని,వారి పేర్లు తమ నోటినుండి చెప్పాలంటేనే సిగ్గువేస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దోర్నాల బ్రిడ్జి నిర్మాణం విషయంలో ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలం అయ్యారని స్థానిక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘువీరారెడ్డి బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి రాజశేఖర్ ఆవుటి సైతం గత 6 నెలల క్రితం దోర్నాల బ్రిడ్జి దగ్గరకు వెళ్లి అక్కడి పరిస్థితి ప్రజలకు వివరించారు. అయినా కూడా కాంట్రాక్టర్ పనులు చేయడంలేదనే సాకుతో నిర్మాణ పనులు గాలికి వదిలేశారు. దాంతో ఇప్పుడు అక్కడ నిన్నటి వరకు జరిగిన పనులు సెంట్రింగ్ డబ్బాతో సైతం కొట్టుకుపోయిన పరిస్థితి. నిర్మాణానికి వాడిన ఐరన్ రాడ్లు ఇప్పుడు నీటిలో భరత నాట్యం చేస్తున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- అక్రమాల కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు శిక్ష….
- వేటగాల వలలో బలవుతున్న వన్యప్రాణులు….!!
- విచారణకు హాజరైన సోనియా… రాహుల్ గాంధీ అరెస్ట్
- గేదెపై ఓ యువకుడి అత్యాచారం.. కేసు నమోదు
One Comment