
క్రైమ్ మిర్రర్, వికారాబాద్: జంట జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరుగుతోంది. వికారాబాద్ చేవెళ్లలో భారీ వర్షాలతో వరద ఉధృతి పెరుగుతోంది. ఉస్మాన్సాగర్ కు ఇన్ఫ్లో 8 వేలు, ఔట్ఫ్లో 8,281 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ఉస్మాన్సాగర్ 13 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల చేశారు. ఉస్మాన్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు, ప్రస్తుతం 1789.10 అడుగుల వరకు నీటిమట్టం ఉందని అధికారాలు తెలిపారు. అలాగే హిమాయత్సాగర్ ఇన్ఫ్లో 8 వేలు, ఔట్ఫ్లో 10,700 క్యూసెక్కులుగా ఉందని చెబుతున్నారు. హిమాయత్సాగర్ దగ్గర 8 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు, ప్రస్తుతం 1761.90 అడుగుల వరకు నీటిమట్టం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Also Read : రాజగోపాల్ రెడ్డి చేరికపై క్లారిటీ ఇచ్చిన బండి…
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలుచోట్ల భారీ వర్షం పడింది. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, కాలనీలు చెరువులను తలపించాయి. చెరువులు అలుగులు పోశాయి. కొన్ని చెరువులు కట్టలు తెగాయి. పత్తి, వరి, కంది, మొక్కజొన్న, పెసర, మినుము తదితర పంటలు నీట మునిగాయి. వాగులు వంకలు పొంగి పొర్లడంతో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఇవి కూడా చదవండి :
- ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధికే వైసీపీ మద్దతు….
- వరుణాగ్రహానికి పంటలు వర్షార్పణం….!!
- విశాఖ వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. ప్రియుడితో నెల్లూరులో ప్రత్యక్షం
- తెలుగుదేశం పార్టీలో అంతర్గత సర్వే….. ఈసారి ఎన్ని సిట్లంటే….
- అక్రమ వెంచర్, నక్ష బాట కబ్జాపై కలెక్టర్ కి పిర్యాదు…