
క్రైమ్ మిర్రర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : అడవి పందులను వేటాడితే పట్టిచ్చేది ఒకరైతే….కేసు చేసేది మరోక్కరా…?? మరి వన్యప్రాణులను కాపాడాల్సిన ఆ శాఖ ఎందుకు ఉన్నట్లు…??ఏం చేస్తున్నట్లు….?? వేటగాల వలలో బలి అవుతున్న వన్యప్రాలను కాపాడాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఏదైనా పట్టిస్తేనే కేసులు చర్యలు తప్ప వారి కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వహిస్తాలేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో అడవులకు సరిహద్దులలో గల గ్రామాలలో వేటగాళ్లు తమ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని ఆటోలు,ఇతర మార్గాల ద్వారా నగరాలు,పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా అడవి పందులకు ఉచ్చులు పెట్టడం,కరెంటు తీగలు అమర్చడం,మందుగుండు సామాగ్రి ద్వారా వాటిని హతమారుస్తున్నారు.గ్రామాలలో ముఠాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున వన్యప్రాణులను వేటాడుతూ వాటి మాంసాన్ని కార్పొరేటు హోటళ్లు,రెస్టారెంట్లకు తరలిస్తున్నారనే వినికిడి. కుందేళ్లు, దుప్పులు, అడవి పందులు, కొండగొర్రెలు, నెమళ్లు, జింకలు వేటగాళ్ల వలలో పడి కనుమరుగయ్యే దశలో ఉన్నాయి.
Also Read : రెండేళ్ల క్రితమే మృతి చెందిన మహిళ.. యజమానికి ఇంటి రెంటు చెల్లిస్తుంది !!
కాగితాలకే పరిమితమైన వన్యప్రాణి సంరక్షణ చట్టం…!!
వన్యప్రాణి సంరక్షణ చట్టం కేవలం కాగితాలకే పరిమితమవుతోంది.ఈ చట్టాన్ని అమలు చేసి వన్య ప్రాణులను రక్షించాల్సిన అటవీ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనే వేట యథేచ్ఛగా కొనసాగుతోంది. అటవీ శాఖ సిబ్బందిలోని కొంతమంది వేటగాళ్లతో చేతులు కలిపి వన్యప్రాణుల వేటకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరి కొంతమంది తమ కనుసన్నల్లోనే ఈ వ్యాపారం జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పోడు వ్యవసాయం మూలంగా అడవులు అంతరించి పోతుండడం, మరోవైపు వేటగాళ్ల వల్ల అటవీ క్షీణత వల్ల వన్య ప్రాణులు కనుమరుగవుతున్నాయి. ఇలా రోజురోజుకూ వన్యప్రాణుల సంఖ్య తగ్గుతుండడం కలవరానికి గురిచేస్తున్నది.
Read Also : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణస్వికారం..
వన్యప్రాణుల కనుమరుగు….!!
జిల్లాలో నిత్యం ఎదో ఓ చోట వేట కొనసాగుతుంటే రాబోయే కాలంలో వన్యప్రాణలు కనుమరుగు అయ్యే పరిస్ధితి నెలకొంది.గతంలో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, కుందేళ్ళు, అడవి పందులు గుంపులు గుంపులుగా దర్శనమిచ్చెది. అడవుల్లో వేటగాళ్లు చెలరేగిపోతుండడం,అడవులు పలచబడడంతో వన్యప్రాణుల మనుగడ తగ్గుతూ వస్తోంది. అడవుల్లో ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికా రులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం అ డవులను పర్యవేక్షించాల్సిన అధికారులు చుట్టపు చూపుగా అడవులకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అడవులు అంతరించి పోతున్నా అటువైపు చూసిన దాఖలాలు లేవు. కలప సరిహద్దులు దాటుతున్నా, వన్యప్రాణుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్‌పై తమిళిసై ఆగ్రహం…
అడవి పంది వేటగాల గుట్టు రట్టు చేసిన నవాబ్ పేట్ పోలీసులు…!!
అడవి పందులను వేటాడి అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అడవి పందులను వేటాడి ప్రాణాలతోనే గమ్య స్థానాలకు చేర్చేలా ప్రత్యేక వ్యవస్థ నిర్మించుకుంటున్నారు. ప్రత్యేక నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసి వారంలో ఓ రోజు కచ్చితంగా పందులను తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అడవి పందులు అరవకుండా మూతిని తాళ్లతో కట్టేస్తున్నారు. జిల్లా దాటగానే వాహనాలను మార్చేందుకు ప్రతి ప్రాంతానికో బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అక్రమార్కులు. ఈ తతంగమంతా అసలు సూత్రధారులు ప్రత్యక్షంగా లేకుండానే పని పూర్తయ్యేలా పక్క ప్లానింగ్ తో చేస్తున్నారు. అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం దాతాపూర్ గ్రామ శివారులో సోమవారం ఉదయం 6 అడవి పందులను వేటాడి బొలెరో వాహనములో తీసుకు వెళుతున్నారనే పక్క సమాచారం రావడంతో వాహనాన్ని ఎస్సై భరత్ రెడ్డి, సిబ్బంది తనిఖీ చేయగా అందులో అడవి పందులను వేటాడి అక్రమ రవాణా చేస్తున్నారని తేలడంతో అందులో ఉన్న 12 మందిని అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పగించడం జరిగిందని నవాబ్ పేట్ ఎస్సై భరత్ రెడ్డి అన్నారు. అడవి పందులను వేటాడిన వాళ్ళు కర్నూల్ జిల్లా వలుగుంద మండలానికి చెందినవారని చెప్పారు.విరందరు నన్మథ గిరి గ్రామానికి చెందిన కడిచెట్టి వెంకట్రాములు, వంకాయల షేక్ అన్న,గంటుమర్రి నరేష్, అల్లి అంబ్రెష్, కావలి బద్రి, కడిచెట్టి హన్మంత్, దండి పోతప్ప, నేహా బస్వరాజ్, కడిచెట్టి నాగేష్, ఎర్వపురం శేఖర్, గొళ్ళెం ఉలిగేష్ లు అడవి పందులను వేటాడి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- పార్టీ మారుతారట.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరట! ఓడిపోతానని రాజగోపాల్ రెడ్డి భయమా?
- రాష్ట్రంలో 13 కొత్త మండలాల ఏర్పాటు… జీవో జరిచేసిన ప్రభుత్వం
- కోమటిరెడ్డి రాజీనామా ఎఫెక్ట్.. నూతన మండలంగా గట్టుప్పల్
- తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక నజర్…