
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు పెను గండం ముంచుకొస్తోంది. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలకు ఊహించని వరద వస్తోంది. అటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఇప్పటికే డేంజర్ లెవల్ దాటిపోయింది. నగర పరిధిలోని చెరువులన్ని నిండిపోవడంతో వరద కాలనీలను ముంచేస్తోంది. సోమవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. నగరంలో ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. దీంతో మళ్లీ వర్షం వస్తే పరిస్ఠితి ఏంటని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Read More : జంట జలాశయాల్లోకి పెరుగుతున్న వరద ప్రవాహం
ఇప్పటికే భారీగా ఉన్న వరదతో హైదరాబాదీలు వణికిపోతుండగా.. ఇప్పుడు జంట జలాశయాలు వాళ్లను మరింత వణికిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎప్పుడు లేనంతగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు వరద పోటెత్తింది. మధ్యాహం 3 గంటల సమయానికి ఉస్మాన్ సాగర్ కు 3 వేల 2 వందల క్యూసెక్కుల వరద వస్తుండగా.. డ్యాం ఎనిమది గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 3 వేల 256 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. అటు హిమయాత్ సాగర్ కు భారీగా వరద వస్తోంది. హిమాయత్ సాగర్ కు 2 వేల 5 వందల క్యూసెక్కుల వరద వస్తుండగా.. నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2 వేల 5 వందల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జంట జలాశయాల నుంచి ఐదున్నర క్యూసెక్కుల వరద మూసీలో ప్రవహిస్తోంది. కుండపోత వర్షాలతో మూసీ ఇప్పటికే ఉప్పొంగుతోంది.
Read More : విశాఖ వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. ప్రియుడితో నెల్లూరులో ప్రత్యక్షం
గండిపేటతో పాటు మూసీ క్యాచ్ మెంట్ ఏరియాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జంట జలాశయాలకు వరద మరింతగా పెరగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు మూసీ పరివాహాక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీకి వరద మరింత పెరిగితే ఎలాంటి పరిస్థితులు వస్తాయోమన్న ఆందోళనలో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి …
- మూడు నెలల క్రితం MLA స్టిక్కర్ పడేశాడట!.. మంత్రి మల్లారెడ్డి కవరింగ్ అదుర్స్..
- ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారు? పీకే టీమ్ తుది నివేదిక ఇచ్చిందా? అసెంబ్లీ రద్దు అప్పుడేనా?
- ఫిలిప్పీన్స్ ఉత్తర భాగంలో భారీ భూకంపం…
- రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ ఫోన్… ఢిల్లీకి రావాలని పిలుపు
- నదిలో దంపతుల మృతదేహాలు లభ్యం….