
నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): జిల్లాలోని మర్రిగూడ మండల కేంద్రం నందు జరిగే అక్రమాలకు అడ్డే లేదనే విధంగా ప్రస్తుత వాతావరణం తయారైంది. ఎక్కడైనా ప్రభుత్వ భూమి కనబడితే చాలు డేగా కండ్లు వేసుకొని, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, పెద్ద మనుషులు, లొట్టలేసుకొని చూస్తున్నారని మండల వ్యాప్తంగా దుమారం లేస్తుంది. అడిగేవారు లేక, చర్యలు తీసుకునే అధికారులు కరువై, వారి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని అనుకుంటున్నారు మండల ప్రజలు. రంగారెడ్డి జిల్లా నుండి నల్గొండ జిల్లాను అనుసంధానం చేసే రహదారి మర్రిగూడ మండలం గుండా పోవటంతో తొండలు కూడా గుడ్లు పెట్టని భూములకు రెక్కలు రావటం, పైరవీ కార్లకు వరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ భూములు, గుట్టలు, వంపులు వర్రెలు అనే తేడానే లేకుండా దర్జాగా కబ్జా పెడుతూ, కాలరెగరేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇదే తరహాలో మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన సర్వేనెంబర్: 5,168 నందు తాతల నాటి నుండి ప్రభుత్వ నక్ష బాట కలదని స్థానికంగా ఉన్న ప్రజలందరికి తెలిసిన విషయమే. అధికారుల పని తనం చూసిన కొంతమంది నాయకులు, బడా లీడర్లు కలిసి యదేచ్చగా నక్ష బాటను కబ్జా చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, సర్వేనెంబర్ 43 నందు ఎలాంటి అనుమతులు లేకుండానే డిటిసిపి హంగుళాలతో వెంచర్ నిర్మాణం చేయటం, రెండు వేలకు కూడా పలుకని గజం భూమికి, ఆరు వేల రూపాయలని చెప్తూ, ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read : కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే పదవి సేఫ్! అందుకే రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి ఫైర్
ఇదేంటని అడుగగా వారు ఎల్ఆర్ఎస్ కట్టారని, అందుకే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారని చెప్పుకొస్తున్నారు మండల అధికారులు. కేవలం పదివేల రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టి, డిటిసిపి వెంచర్ మాదిరిగా రోడ్లు, కరెంట్, డ్రైనేజ్ నిర్మాణాలు చేస్తుంటే అధికారులు ఏమీ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తాయిలాల మోజులో అధికారులు తులతూగుతున్నారు కాబట్టే, రాజకీయ నాయకులు ఏమి చేసినా పట్టించుకోవటం లేదనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రభుత్వ నక్ష బాటకు లంకంత కొంప కట్టినా పట్టించుకోని అధికారులు, ఇక ప్రజలకేమి న్యాయం చేస్తారని విమర్శిస్తున్నారు ప్రజలు. ఈ అంశాలపై క్రైమ్ మిర్రర్ దినపత్రిక నందు వరుస కధనాలు రావటంతో, స్థానిక గ్రామ పంచాయతీ నుండి ఒక ప్లెక్సీ ఏర్పాటు చేసి, అనుమతులు లేని ఈ వెంచర్ లో ఎవరు కూడా ప్లాట్లు కొనవద్దని హెచ్చరిక బోర్డు పెట్టారు. అది అక్రమ వెంచరని తెలిసి గాలికి ఎగిరిపోయే ప్లెక్సీ పెట్టిన అధికారులు కనీసం, సంబంధిత వ్యక్తులకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని? రోడ్లను, కరెంట్ స్తంబాలను, డ్రైనేజ్ వ్యవస్థను ఎందుకు తొలగించటం లేదని స్థానికులు అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలపై మండల వాసి జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశారు. అనుమతి లేకుండా నిర్మాణం చేసిన అక్రమ వెంచర్ యజమానిపై, నక్ష బాటను కబ్జా చేసిన వారిపై, ఇవన్నీ తెలిసి కూడా ఏమాత్రం స్పందించకుండా ఉన్న డిపివో, ఎంపిడివో, ఎంపివో లతో పాటు అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన అప్పటి పంచాయతీ సెక్రటరీ లపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తుంది.
✍🏿✍🏿 అనుక్షణం ప్రజల పక్షాన నిలబడుతూ, అక్షరం అనే ఆయుధంతో అక్రమాలను వెలికి తీస్తున్న మీ క్రైమ్ మిర్రర్ పత్రిక ఈ అక్రమ దారులపై, అధికారులపై, జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకునే వరకు వార్తలు ప్రచురిస్తూనే ఉంటాము. నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది✍🏿
ఇవి కూడా చదవండి :
- ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఊహించని వరద.. హైదరాబాద్ కు పెను గండమే!
- “కాళేశ్వరం అవినీతిపై హైకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి”
- విచారణకు హాజరైన సోనియా… రాహుల్ గాంధీ అరెస్ట్
- అక్రమాల కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు శిక్ష….
- వేటగాల వలలో బలవుతున్న వన్యప్రాణులు….!!
One Comment