
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపనున్నారు. సీఎం కేసీఆర్ వెంట కొందరు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో బస చేయనున్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కాకుండా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ద్రౌపది ముర్మును కలవడం ఆసక్తిగా మారింది.
Read Also : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణస్వికారం..
జాతీయ పార్టీ ప్రకటన పైన రంగం సిద్దం చేసుకున్న ఆయన..రాష్ట్రపతి ఎన్నికల వేళ చిన్న గ్యాప్ ఇచ్చారు. నేడు నూతన రాష్ట్రపతి గా ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో..తిరిగి ఢిల్లీ కేంద్రంగా తిరిగి సీఎం కేసీఆర్ కార్యాచరణ అమలుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా.. విపక్ష పార్టీల నేతలతో ముందుగా కేసీఆర్ సమావేశం కానున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరేట్ అల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా విపక్షాలు ప్రకటించగా.. నామినేషన్ దాఖలు చేసారు. విపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా దక్షిణాదికి చెందిన మహిళా అభ్యర్ధిని ఉప రాష్ట్రపతి రేసులో నిలబెట్టారు. దీంతో..కాంగ్రెస్ వ్యక్తికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. విపక్ష నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ తన వైఖరి పైన క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో విపక్ష పార్టీల్లో కీలకమైన టీఎంసీ తాము మద్దతు ఇవ్వలేమని చెబుతూ..తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ సైతం అదే నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, విపక్ష నేతలతో భేటీ తరువాతనే కీలకం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
Also Read : రాష్ట్రంలో 13 కొత్త మండలాల ఏర్పాటు… జీవో జరిచేసిన ప్రభుత్వం
ఇక..జాతీయ పార్టీ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. పార్టీ ముఖ్య నేతలు సైతం సీఎంతో పాటుగా ఢిల్లీలో ఉండనున్నారు. అనేక మంది మేధావులు..వివిధ రంగ నిపుణులతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కేంద్రం తీరును వారంతా తప్పు బడుతూ సీఎం కేసీఆర్ అభిప్రాయాలతో ఏకీభవించారు. ఈ పరిస్థితుల్లో.. అటు ఢిల్లీ ..ఇటు హైదరాబాద్ కేంద్రంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో వరుస సమావేశాలకు సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నట్లుగా సమాచారం. ఈ పర్యటనలో రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, పలు రంగాల్లో పని చేసి పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ లతో భేటీ కానున్నట్లు చెబుతున్నారు. ఇక, తెలంగాణలోనూ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో..తన రాజకీయ వ్యూహాలను మరింత వేగంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో..ఢిల్లీ కేంద్రంగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఓడిస్తామంటూ కేసీఆర్ శపధం చేసారు. అందులో బాగంగా.. కలిసొచ్చే పార్టీలతో మంతనాలు ఈ పర్యటనలో కీలకం కానున్నాయి.
ఇవి కూడా చదవండి :
- రెండేళ్ల క్రితమే మృతి చెందిన మహిళ.. యజమానికి ఇంటి రెంటు చెల్లిస్తుంది !!
- తెలంగాణ జనసేన చీఫ్ గా తీన్మార్ మల్లన్న? తెలుగు రాష్ట్రాల కాపులు కలిసిపోతారా?
- పార్టీ మారుతారట.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరట! ఓడిపోతానని రాజగోపాల్ రెడ్డి భయమా?
- కోమటిరెడ్డి రాజీనామా ఎఫెక్ట్.. నూతన మండలంగా గట్టుప్పల్
- వరదలకు కొట్టుకుపోయిన 163వ జాతీయ రహదారి
- రాజ్‌భవన్ లో ఘనంగా బోనాల పండుగ…