
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో కాక రేపుతోంది. దాదాపు ఏడాదిన్నర నుంచి ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. గత ఏడాదే ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతలతో రహస్య సమావేశాలు జరిపారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ మారలేదు. అయితే తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు రాజగోపాల్ రెడ్డి. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. అమిత్ షాను తాను కలిసింది నిజమేనని రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పారు. దీంతో కోమటిరెడ్డి బీజేపీలో చేరాక.. అతనితో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నిక తీసుకురావాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారనే చర్చ సాగింది. రాజగోపాల్ రెడ్డి తీరుతో మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమనే వాతావరణం ఏర్పడింది. అధికార పార్టీ కూడా స్పీడ్ పెంచింది.
Read More : కోమటిరెడ్డి రాజీనామా ఎఫెక్ట్.. నూతన మండలంగా గట్టుప్పల్
అయితే పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై మాత్రం వెనుకంజ వేశారు. హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి.. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని, పార్టీ మారడం చారిత్రక అవసరమని చెప్పారు. పార్టీ మారడానికి సమయం వచ్చిందన్నారు. కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసింది నిజమేనని.. కాని అతనితో రాజకీయాలు మాట్లాడలేదని తెలిపారు. హుజురాబాద్ ఉపఎన్నికతో పోయిన ప్రతిష్టను.. మునుగోడు ఉపఎన్నికతో తిరిగి తెచ్చుకోవాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని అన్నారు. తనపై కేసీఆరే దుష్ప్రచారం చేయిస్తున్నారని, మునుగోడుకు ఉపఎన్నిక రావాలని తాను కోరుకోవడం లేదన్నారు. కేసీఆర్‌ను ఎదురుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని తప్పుబట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ల కింద పనిచేయాలంటే ఇబ్బందేనని, జైలుకెళ్లి వచ్చిన వాళ్లు కూడా నీతులు చెప్తే ఎలా? అంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు రాజగోపాల్‌రెడ్డి.
Also Read : రాధమ్మ పై కేసు నమోదు, అనాదైన కన్న తల్లి….
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం.. బీజేపీలో చేరడం ఖాయమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారనే చర్చ సాగుతోంది. అయితే ఉప ఎన్నికలో తనకు ఓటమి ఖాయమని తెలుసు కాబట్టే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి భయపడుతున్నారనే టాక్ వస్తోంది. మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గెలిచి మూడున్నర ఏండ్లు దాటింది. కాని నియోజకవర్గానికి వచ్చింది మాత్రం కొన్నిసార్లే. ఆయన మునుగోడు ప్రజలను పట్టించుకోకుండా సొంత వ్యాపారాలు చూసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిసార్లు నెలల తరబడి ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో గత మూడున్నర ఏళ్లుగా మునుగోడులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. జిల్లా మంత్రితో రాజగోపాల్ రెడ్డికి విభేదాలు ఉండటం నియోజకవర్గానికి శాపంగా మారింది. దీంతో జిల్లాలోని మిగితా నియోజకవర్గాలకు ఫండ్స్ వచ్చినా రాజగోపాల్ రెడ్డి కారణంగా మునుగోడుకు రాకుండా పోయాయనే విమర్శలు ఉన్నాయి. మంత్రిని తాను అడగనంటూ రాజగోపాల్ రెడ్డి పట్టుకు పోవడం నియోజకవర్గ ప్రజలకు భారంగా మారింది. రాజగోపాల్ రెడ్డి తీరుతో కల్యాణ లక్ష్మీ వంటి పథకాల అమలకు అవాంతరాలు వచ్చాయని అంటారు.
Read More : తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి!
మూడున్నర ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో రాజగోపాల్ రెడ్డిపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసు కాబట్టే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి భయపడుతున్నారని అంటున్నారు. ఉప ఎన్నికలో ఓడిపోతే ఆయన భవిష్యత్ రాజకీయాలకు కష్టం. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ప్లాన్ చేస్తున్నారనే అభిప్రాయం వస్తోంది. అంతేకాదు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నేతల్లో ఒకరిద్దరు తప్ప ఎవరూ ఆయనతో వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. తనతో రావడానికి కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపడం లేదని గ్రహించిన రాజగోపాల్ రెడ్డి .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి జంకుతున్నారని టాక్ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ వాళ్లే తనను సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డని తిడుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యాకా బీజేపీలో చేరితే అనర్హత వేటు కూడా పడే అవకాశం లేదు. ఇలా ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక రాకుండా చూస్తూ బీజేపీలో చేరేలా రాజగోపాల్ రెడ్డి ప్లాన్ చేశారని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- నేడు ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్….
- దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్‌పై తమిళిసై ఆగ్రహం…
- భారతదేశ 15వ రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణస్వికారం..
- రెండేళ్ల క్రితమే మృతి చెందిన మహిళ.. యజమానికి ఇంటి రెంటు చెల్లిస్తుంది !!
- సొంతగూటికి చేరుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు
One Comment