
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ ప్రతినిధి : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు శనివారం తెరుచుకున్నాయి. ప్రాజెక్టు మూడు గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. కృష్ణ నదితో పాటు తుంగభద్ర నుండి వరద వస్తేనే శ్రీశైలం నీటిమట్టం పెరుగుతుంది. ఈసంవత్సరం కూడా తుంగభద్ర నుంచి భారీగా వరద నీరు దిగువకు వచ్చింది. ఆల్మట్టి, నారాయణపూర్ లను దాటుకొని జూరాల మీదుగా కృష్ణ నది వరద నీరు రావడంతో శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు 881.90 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎక్కవ సార్లు ఆగష్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో జలాశయం నీటిమట్టం గారిష్టస్థాయికి చేరేది. కాని జులై నెలలోనే నీటిమట్టం పెరిగి ప్రాజెక్టు గేట్లను ఎత్తడం పనేండు సంవత్సరాలలో ఇది మూడవ సారి మాత్రమే కావడం విశేషం.
ఇవి కూడా చదవండి :
- రాజ్‌భవన్ లో ఘనంగా బోనాల పండుగ…
- వరదలకు కొట్టుకుపోయిన 163వ జాతీయ రహదారి..
- కోమటిరెడ్డి రాజీనామా ఎఫెక్ట్… నూతన మండలంగా గట్టుప్పల్
- తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక నజర్…
- సింగరేణిలో ఆదాని ఎంట్రీని కెసిఆర్ ఆపగలడ…??