
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గత వారంలో నగర పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. మధ్యలో నాలుగు రోజులు చినుకు పడలేదు. తాజాగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం నుంచి ముసురు కమ్మేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. సిటి పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రామచంద్రాపురంలో 24 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కాప్రాలో 22, ఉప్పల్ లో 20, లింగంపల్లిలో 19, ముషిరాబాద్ లో 15 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి కూడా గ్రేటర్ పరిధిలో మోస్తరు వర్షం కురిసింది.
Read More : మహంకాళి బోనాల్లో ఉద్రిక్తత.. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లిన రేవంత్ రెడ్డి
భారీ వర్షంతో గ్రేటర్ పరిధిలో రోడ్లపైకి భారీగా వరద ప్రవహిస్తోంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమలం అయ్యాయియ దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామైంది. ఉదయం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షియర్ జోన్ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం వరకు హైదరాబాద్ సహా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్ష సూచనతో హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున రోడ్లపైకి రావొద్దని సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దన్నారు. భారీ వర్షాలతో వరద నీరు రోడ్లపైకి చేరిన నీరు బయటకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు.
ఇవి కూడా చదవండి …
- కోమటిరెడ్డి రాజీనామా ఎఫెక్ట్.. నూతన మండలంగా గట్టుప్పల్
- సింగరేణి లోకి ఆదాని ఎంట్రీని కెసిఆర్ ఆపగలడ…??
- తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక నజర్…
- బీజేపీ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే! క్లారిటీ ఇచ్చిన సీతక్క..
- టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే వనమా సస్పెండ్? సూసైడ్ కేసులో కొడుకు అరెస్ట్..