
క్రైమ్ మిర్రర్, చండూర్ : నల్గొండ జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. నూతన మండలంగా గట్టుప్పల్ ను ఏర్పాటు చేసింది. జిల్లాల విభజన సమయంలోనే గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయాలను సిద్ధం చేశారు. అయితే కొత్త జిల్లాల ప్రకటనకు ముందు రోజు సీన్ మారిపోయింది.
అప్పటి నుంచి గట్టుప్పల్ మండలం కోసం ఉద్యమం జరుగుతోంది. ఏడేళ్లుగా గట్టుప్పల్ వాసులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. తాజాగా వారి ఉద్యమం ఫలించి కల సాకారం కాబోతోంది. ఎట్టకేలకు మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో నెరవేరిన గట్టుప్పల్ మండలం కల నెరవేరింది. ప్రభుత్వ నిర్ణయంతో గట్టుప్పల్ గ్రామస్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ..మరోవైపు తమ గ్రామాన్ని గట్టుప్పల్ మండలంలో కలపవద్దని.. మర్రిగూడంలోనే ఉంచాలని అంతంపేట గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- సింగరేణి లోకి ఆదాని ఎంట్రీని కెసిఆర్ ఆపగలడ…??
- తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక నజర్…
- హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం.. బయటికి రావొద్దని పోలీసుల హెచ్చరిక
- తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి!
- ముర్మును గెలిపించిన క్రాస్ ఓటింగ్…
One Comment