
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ ఇవ్వాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధిష్ఠానం.. ప్రతిపక్షాల మద్దతును కూడగట్టింది. పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాడబోతోంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సీబీఐ, ఈడీ వంటి కేంద్రీయ దర్యాప్తు ఏజెన్సీలను మోడీ సర్కార్.. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, దీనికి వ్యతిరేకంగా పోరాడటానికి సహకరించాలంటూ పిలుపునిచ్చింది. ఈ మేరకు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గె ఈ ఉదయం ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి టీఆర్ఎస్ తరఫున పార్టమెంటరీ పార్టీ అధినేత కే కేశవరావు, నామా నాగేశ్వర రావు, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్ సభ్యులు హాజరయ్యారు.
Also Read : ముందు ముందు కేంద్ర రాయితీలు బందు…. సెలవిచ్చిన ప్రధాని
అనంతరం ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. తమ రాజకీయ ప్రత్యర్థులను మోడీ సర్కార్ అణగదొక్కుతోందని, దీని కోసం రాజ్యంగబద్ధమైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని విమర్శించారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులపై దాడులు చేయించిందని, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఉమ్మడిగా దీన్ని ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని, దీనికోసం రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో టీఆర్ఎస్ తరఫున కే కేశవరావు, ఎండీఎంకే నాయకుడు వైగో, ఎన్సీపీ నుంచి వందన చవాన్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నుంచి సంజయ్ రౌత్, జే అండ్ కే నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి హస్నయిన్ మసూది, ఆర్జేడీ నుంచి అహ్మద్ కరీం, సీపీఐ సభ్యుడు బినోయ్ విశ్వం, డీఎంకే తరఫున తిరుచ్చి శివ సంతకాలు చేశారు. ఈ విషయంలో వారందరూ కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటాన్ని సాగించనున్నారు.
Read Also : అందని పాఠ్యపుస్తకాలు… ముందుకు సాగని చదువులు
ఇకదీంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అంచనాలన్నీ తారుమారయ్యాయి. తలకిందలయ్యాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.. కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. మొన్నటివరకు తటస్థంగా లేదా.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో కనిపించిన టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం- తన వైఖరేమిటో తాజాగా స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ప్రతిపక్ష కూటమిలో చేరినట్టే. టీఆర్ఎస్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం- కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సైద్ధాంతిక పోరాటాల వరకే పరిమితమౌతుందా? లేక.. రాజకీయంగానూ రూపు మార్చుకుంటుందా? అనేది ఆసక్తికరం. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్-టీఆర్ఎస్ ఒకే గొడుగు కిందికి వచ్చినట్టయింది. దీని ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద పడుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
Also Read : రాష్ట్రపతి ఎన్నికల ఫలితం… ఆ ఊరిలో పండగ
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎడతెగని పోరాటాన్ని సాగిస్తోన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి దూకుడుకు ఈ పరిణామాలు కొంత బ్రేక్ వేసే అవకాశాలు లేకపోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీసీసీ నాయకత్వం చేస్తోన్న పోరాట తీవ్రతను తగ్గించేలా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆదేశాలు అందినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థిితి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఇవి కూడా చదవండి :
- దేశ సరిహద్దులో గ్రామం నిర్మించిన డ్రాగన్ కంట్రీ
- ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రిపై ఫైర్ అయిన మంత్రి కేటిఆర్
- పొత్తి కడుపులో నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువతి.. ఎక్స్‌రే రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్
- అవసరం కోసం చేసిన అప్పు… ప్రాణం తీసింది…
- ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రిపై ఫైర్ అయిన మంత్రి కేటిఆర్
One Comment