
క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్(రామప్ప): కేజీ టు పీజీ ఉచిత విద్య అని గొప్పలు చెప్పిన తెలంగాణ సర్కారు ఇప్పుడు కనీసం ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకునే విద్యార్ధుల పట్ల సర్కార్ మరింత చిన్నచూపు చూస్తోంది. మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ పరిస్థితి చూస్తే ఇది నూటికి నూరు శాతం నిజం అనే సమాధానం వస్తుంది.
Also Read : ఆదిక్యంలో దుసుకేల్తున్న ద్రౌపతి ముర్ము…
హాస్టల్ వార్డెన్ స్థానికంగా ఉంటూ విద్యార్థులను హాస్టల్ లో చేసుకోవాల్సి ఉండగా ఇన్చార్జి వార్డెన్ కారణంగా హాస్టల్ ను పట్టించుకోకపోవడం వలన హాస్టల్ కు విద్యార్థులు ఎవరు రావడం లేదు. దీంతో జిల్లా అధికారుల నిర్లక్ష్యం వలన హాస్టల్ మూతబడడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి హాస్టల్ మూతపడకుండా స్థానిక ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో చదువుతున్న ఎస్సి విద్యార్థులను హాస్టల్లో అడ్మిషన్ చేసుకునే విధంగా జిల్లా సంక్షేమ అధికారులకు మరియు వార్డెన్ కు ఆదేశాలు ఇవ్వాలని పలువురు కోరుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- కాంగ్రెస్కు మద్దతు తెలిపిన తెరాస…
- ముందు ముందు కేంద్ర రాయితీలు బందు…. సెలవిచ్చిన ప్రధాని
- రాష్ట్రపతి ఎన్నికల ఫలితం… ఆ ఊరిలో పండగ
- నేడు ముగిసిన సోనియా విచారణ… సోమవారం మళ్ళి విచారణ