
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పోల్ అయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ తెలిపారు. ముర్ముకు పోలయిన 540 ఓట్ల విలువ 3,78,000, యశ్వంత్ సిన్హాకు పోలయిన ఓట్ల విలువ 1,45,600గా ఆయన పేర్కొన్నారు. 15 ఓట్లు చెల్లనివిగా తెలిపారు. తదుపరి ప్రకటన కోసం వేచి ఉండాలని పీసీ మోడీ కోరారు. వీటిని తొలి రౌండ్ ఫలితాలుగా పేర్కొన్నారు. ఫలితాల ట్రెండ్‌ను చూస్తే రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు నల్లేరుపై నడకగానే కనిపిస్తోంది. తొలి రౌండ్‌లో ఎన్డీయే అభ్యర్థి ముర్ము ఆధిక్యం కనబర్చడంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఏపీలో అధికార వైసీపీ , ప్రతిపక్ష టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థికే జై కొట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాను బలపరిచింది.
ఇవి కూడా చదవండి :
- రాష్ట్రపతి ఎన్నికల ఫలితం… ఆ ఊరిలో పండగ
- ముందు ముందు కేంద్ర రాయితీలు బందు…. సెలవిచ్చిన ప్రధాని
- కాంగ్రెస్కు మద్దతు తెలిపిన తెరాస…
- అందని పాఠ్యపుస్తకాలు… ముందుకు సాగని చదువులు
One Comment