
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): గత కొన్ని రోజుల నుండి న్యాయం కోసం పోరాడిన గోల్కొండ రాధమ్మను మర్రిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎమ్మార్వో కత్తుల సంఘమిత్ర పిర్యాదు మేరకు రాధమ్మ ఇంటి వద్ద బుధవారం తెల్లవారు జామున అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన విషయంలో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే అనారోగ్యం పాలైన రాధమ్మను కష్టడికి తీసుకోవటం పట్ల స్థానికులు పోలీసులపై మండిపడ్డారు. అన్ని తానైన రాధమ్మ కన్నతల్లి ముత్తమ్మ నేడు అనాధ కావటం అందరిని కంటతడి పెట్టించింది. దాదాపు 90 ఏండ్లకు ఉన్న తను గత కొన్ని సంవత్సరాల క్రితమే మంచాన పడింది.
Also Read : న్యాయం జరిగే వరకు…టెంటు తీసేది లేదు…
ఇద్దరు కూతుర్లు, కుమారుడు బయట చదువుకోవటం కారణంగానే, రాధమ్మ దీక్షలో వారు పాల్గొనలేదని అనుకుంటున్నారు. మొదటి నుండి వారిది నిరుపేద కుటుంబం కావున, కష్టపడి కొన్న భూమి కండ్ల ముందే మాయం కావటం రాధమ్మ జీర్ణించుకోలేక పోయిందని, అన్ని తెలిసిన డిప్యూటీ ఎమ్మార్వో డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసిందని మొదటి నుండి రాధమ్మ ఆరోపిస్తూనే ఉంది. డబ్బులు తీసుకొనే డిటి రిజిస్ట్రేషన్ చేసిందని చాలా మంది అనుకుంటున్నారు.రాధమ్మ అరెస్ట్ తో అఖిల పక్ష నాయకులు కన్నెర చేశారు. మండల వ్యాప్తంగా అఖిల పక్ష నాయకులు నేటి నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాధమ్మ లేకున్నా ఉద్యమం ఆగేలా లేదని మండల వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి :
- ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రిపై ఫైర్ అయిన మంత్రి కేటిఆర్
- అవసరం కోసం చేసిన అప్పు… ప్రాణం తీసింది…
- సొంతగూటికి చేరుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు
One Comment