
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళకు టెస్టులు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు. వెంటనే ఓ అరుదైన ఆపరేషన్ చేశారు. ఈ ఘటన టర్కీలో జరిగింది. ఓ యువతికి పొత్తి కడుపులో నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులకు చెబితే.. ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చారు. అది వేసుకున్నాక నొప్పి తగ్గుతుందిలే అని భావిస్తే.. విపరీతంగా పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడు డాక్టర్లు టెస్టులు చేసిన అనంతరం రిపోర్ట్స్ చూసి స్టన్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. టర్కీలోని తూర్పు వాన్ ప్రావిన్స్ లో 24 ఏళ్ల యువతి పొత్తికడుపు నొప్పితో వాన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్ కు వచ్చింది.
Also Read : అవసరం కోసం చేసిన అప్పు… ప్రాణం తీసింది…
టెస్టుల నివేదికలు చూసిన అనంతరం ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉందని గుర్తించి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆపరేషన్ చేస్తున్న క్రమంలో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ కంగుతిన్నారు. ఎందుకంటే ఆమె కడుపులో గోర్లు, సూదితో సహా 158 మెటల్ వస్తువులు కనిపించాయి. వాటన్నింటిని జాగ్రత్తగా రిమూవ్ చేశారు. రెండున్నర గంటల పాటు జరిగిన శస్త్రచికిత్సలో నెయిల్ క్లిప్పర్స్, పాకెట్ నైఫ్, పండ్ల కత్తి, పట్టకార్లు, గోర్లు, సూదులు, స్క్రూలు, తాళం చెవులు సహా 158 వస్తువులు బయటకు తీశారు. సర్జరీ చేసిన జనరల్ సర్జన్ డాక్టర్ యూసుఫ్ టెకేస్ మాట్లాడుతూ.. మొదట ఎండోస్కోపీతో కడుపులోని వస్తువులను తొలగించాలనుకున్నట్లు తెలిపారు. కానీ ఎక్స్‌రే రిపోర్ట్‌లో చాలా వస్తువులు కనిపించడంతో ఆపరేషన్ చేసినట్లు వెల్లడించారు. కానీ శస్త్రచికిత్స సమయంలో లోపల వస్తువులను చూసి తామంతా షాక్ తిన్నట్లు తెలిపారు. వివిధ పరిమాణాలలో 158 వస్తువులు ఉన్నాయని… వాటన్నింటినీ తొలగించినట్లు వివరించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు యూసుఫ్ టెకేస్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- రాధమ్మ పై కేసు నమోదు, అనాదైన కన్న తల్లి….
- దేశ సరిహద్దులో గ్రామం నిర్మించిన డ్రాగన్ కంట్రీ
- ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రిపై ఫైర్ అయిన మంత్రి కేటిఆర్
- నాగబాబు ట్వీట్.. నారాయణ స్పందన
- సొంతగూటికి చేరుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు
One Comment