
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన గోల్కొండ రాధమ్మ తన భూమి అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని, తనకు న్యాయం చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్ష మంగళవారం నాడు కొనసాగింది. మండలంలోని పలు పార్టిల నాయకులు,కార్యకర్తలు ఆమెకు సంఘీభావం తెలిపి ఆమె దీక్షలో పాల్గోన్నారు. మంగళవారం నాడు రాధమ్మ చేస్తున్న దీక్ష స్థలాన్ని దేవరకొండ ఆర్డిఓ గోపీరామ్ నాయక్ పరిశీలించి, రాధమ్మతో మాట్లాడారు. గత వారం ఇచ్చిన హామీ ఏమయిందని, ఇప్పటికి తన భూమి సమస్య పరిష్కారంలో ఎటువంటి ముందడుగు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : ఏపీ, తెలంగాణ మధ్య కొత్త రగడ.. హైదరాబాద్ పై బొత్స సంచలన వ్యాఖ్యలు
కార్యాలయంలో పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ తన భూమిని వేరొక్కరికి కావాలనే పట్టా చేశారని, అలాంటి అధికారులపై వెంటనే చట్ట పరమైన చర్యలు పోలీసులు ఎందుకు తీసుకోరని ఆమె ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తన భూమి తనకు వచ్చే వరకు ఎన్ని రోజులైనా సరే పోరాటం కొనసాగిస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్, బీజేపీ పార్టి మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరామ్ గౌడ్, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పగడాల లింగయ్య, మండల్ పార్టి అధ్యక్షుడు దోమల వెంకన్న, ఎంఆర్పిఎస్ మండల సీనియర్ నాయకులు వడ్డే వెంకటేష్ మాదిగ,నాయకులు అంజయ్య, నర్ర పరమేష్, చిట్యాల యాదగిరి రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- నెంబర్ ప్లేట్ కనిపించకపోతే అంతే సంగతి…. ట్రాఫిక్ పోలిసుల హెచ్చరిక
- కౌగిలింతకు రూ.7 వేలు.. కేవలం గంట మాత్రమే..
- పిచ్చి ప్రేమతో బిచ్చగాడిలా మారి……
- ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్…. ఖుషి అవుతున్న ఫ్యాన్స్
2 Comments