
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బాధలో ఉన్నవారికి ప్రేమగా ఓ కౌగిలింత ఇచ్చినందుకు రూ.7 వేలు తీసుకుంటున్నారు.ఇది వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇంగ్లాండ్ కు చెందిన ట్రెవర్ హూటన్ ఒక ప్రొఫెషనల్ కౌగిలింత అందించే వ్యక్తిగా పేరు సంపాదించాడు. బాధలో ఉన్నవారికి అతను ఒక గంట పాటు ప్రేమతో హగ్ ఇచ్చి ఓదార్చుతాడు. ఇందుకు అతను రూ.7,000 తీసుకుంటాడు. అతని కౌగిలింతలో ఏముందని అనుకోవచ్చు కానీ.. ట్రెవర్ హూటన్ హగ్ కోసం చాలా క్యూలో ఉంటారట. కొద్ది రోజుల క్రితం బ్రిటన్ లోని బ్లిస్టల్ ప్రాంతంలో కౌగిలింత వైద్యం (కడల్ థెరపీ) మొదలైంది. కొద్ది కాలానికే ఈ వైద్యానికి డిమాండ్ పెరిగింది. ట్రెవర్ హూటన్ ఈ వైద్యాన్ని మొదలు పెట్టి క్రమంగా పేరు పొందాడు. దీంతో అతడి కౌగిలింత కోసం బాధితులు తరలివస్తున్నారు.
Also Read : ఏపీ, తెలంగాణ మధ్య కొత్త రగడ.. హైదరాబాద్ పై బొత్స సంచలన వ్యాఖ్యలు
కడల్ థెరపీలో భాగంగా ట్రవర్ హూటన్ ఒంటరితనంతో బాధపడే వారిని హగ్ చేసుకుంటాడు. ఇలా అతను గంటసేపు కౌగిలించుకున్నందుకు రూ.7 వేలు తీసుకుంటున్నాడు. డిప్రెషన్ లో ఉన్నవారికి ఉపశమనాన్ని కలిగిస్తున్నాడు. చాలా మంది తన కౌగిలింత తీసుకుని ప్రశాంతంగా వెళ్తారని చెప్పాడు. కడల్ థెరపీ ఆనేది ఒక ప్రొఫెషనల్ మాత్రమే.. మేం ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తామని ట్రవర్ హూటన్ తెలిపాడు.అందుకే దీనిని వృత్తిగా మార్చుకున్నట్లు వివరించాడు. తమ ప్రొఫెషనల్ ను తప్పుగా భావిస్తున్నారని, ఈ వృత్తిని సెక్స్ వర్క్ గా చూస్తున్నారని చెప్పాడు. కానీ ఇది ఏ మాత్రం అలాంటి పని కాదని ట్రవర్ హూటన్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి :
- పిచ్చి ప్రేమతో బిచ్చగాడిలా మారి……
- ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్…. ఖుషి అవుతున్న ఫ్యాన్స్
- రంగారెడ్డి జిల్లా తెరాసలో వర్గపోరు……
- వెంకయ్యనాయుడి శకం ముగిసినట్టేనా….
- తెలంగాణ రాష్ట్రంలో సర్వేల సందడి….