

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ గురించి ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. చరిత్రలో కలవని ఇద్దరు యోధులను ఈ సినిమా ద్వారా రాజమౌళి కలిపి చరిత్ర సృష్టించారు.ఈ విధంగా స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లో రన్ అవుతూ అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.థియేటర్లోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమా అద్భుతమైన రికార్డులను సృష్టించి హాలీవుడ్ సినిమాలకు పోటీగా నిలబడింది. ఇకపోతే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా.రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు.
Read Also : రంగారెడ్డి జిల్లా తెరాసలో వర్గపోరు……
ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను తిరిగి రాయడమే కాకుండా తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు గెలుపొందడం సామాన్యమైన విషయం కాదు.ఆస్కార్ బరిలో నిలవాలన్నా కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలబడి మరో రికార్డును సొంతం చేసుకుంది. భారతదేశం నుంచి ఆస్కార్ బరిలో ఈ సినిమా నిలవడం విశేషం. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ప్రకటించడంతో తెలుగు సినీ ప్రేమికులు, ఎన్టీఆర్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- విద్యార్థినులు బ్రాలు తీసేస్తేనే ఎంట్రీ! నీట్ పరీక్ష కేంద్రం దగ్గర అరాచకం
- మొక్కుబడి పూజలు మానుకోవాలి…..
- బీజేపీ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే! క్లారిటీ ఇచ్చిన సీతక్క..
- తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్! విజయశాంతి సంచలనం..
- వెంకయ్యనాయుడి శకం ముగిసినట్టేనా….
2 Comments