
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తన భక్తులను ఎలాంటి ఆపద లేకుండా చూసుకుంటానని, కంటతడి పెట్టకుండా పూజలు చేయాలని, కోరుకున్నది తప్పక నెరవేరుతుందని భవిష్యవాణి చెప్పారు. గర్భిణులకు, బాలింతలకు ఎటువంటి బాధలు రానివ్వనని అమ్మవారి వాక్కుగా చెప్పారు.
Also Read : వెంకయ్యనాయుడి శకం ముగిసినట్టేనా….
‘ప్రజలు పూజలు మొక్కుబడిగా చేసున్నారు. పూజలు మీ సంతోషానికే చేస్తున్నారు తప్ప.. నా కోసం కాదు. నాకు పూజలు చేస్తున్నారా.. వాస్తవం చెప్పండి. పూజలు ఎలా చేయాలో ఏటా నన్నే అడుగుతున్నారు. మొక్కుబడిగా పూజలు చేస్తున్నా.. నా బిడ్డలే కదా అని భరిస్తున్నా. మీరు నా గుడిలో పూజలు సరిగా సరిపించడం లేదు. గర్భాలయంలో శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. పూజలు సక్రమంగా, భక్తిశ్రద్ధలతో జరిపించండి. నేను సంతోషంగా పూజలు అందుకోవాలని అనుకుంటున్నా.
Read Also : కేసీఆర్ చెప్పిన క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ? ఆకస్మిక వరదలు స్పష్టించడం సాధ్యమా
ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు.. మీకు నచ్చినట్లు మారుస్తారా?. స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. మీరేంటి నాకు చేసేది.. నేను తెచ్చుకున్నదే కదా. దొంగలు దోచినట్లుగా నా నుంచే మీరు కాజేస్తున్నారు. మీ కళ్లు తెరిపించేందుకే ఆగ్రహంతో వర్షాలు కురిపిస్తున్నా. ఆగ్రహం తట్టుకోలేరనే కోపాన్ని గోరంతే చూపుతున్నా. మీరు కొండంత తెచ్చుకుంటున్నా నాకు గోరంతే పెడుతున్నారు. నా విగ్రహ ప్రతిష్ఠను ఏడాదిలోపు నాకు స్థిరంగా చేయండి. ఎటువంటి ఆపద లేకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటా. మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది. కంటతడి పెట్టకుండా నాకు పూజలు చేయండి. మీరు ఎన్ని తప్పులు చేసినా నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నా. గర్భిణులు, బాలింతలకు ఎటువంటి ఆపద రానివ్వను’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు..
ఇవి కూడా చదవండి :
- సికింద్రాబాద్ మహంకాళి బోనాల్లో ఉద్రిక్తత.. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లిన రేవంత్ రెడ్డి
- గోదావరికి వరదల వెనుక కుట్రలు… భద్రాచలంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
- ముంబైలో ఘనంగా తెలంగాణ ఆషాడమాస బోనాలు
- తెలంగాణ రాష్ట్రంలో సర్వేల సందడి….