
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తప్పులో కాలేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు వేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఓటును సీతక్క ముర్మూకు ఓటు వేసుకుంది. ఇంకా బ్యాలెట్‌లో సీతక్క ఓటు వేయలేదు. ఆర్వోతో ఆమె డిస్కస్ చేస్తున్నారు. కొత్త బ్యాలెట్ పత్రం కోసం అభ్యర్థిస్తున్నారు. ఫైనల్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.
Also Read : వెంకయ్యనాయుడి శకం ముగిసినట్టేనా….
అయితే సీతక్క పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును ముర్మూకి వేశారా? లేదంటే కావాలనే అణగారిన వర్గాలకు చెందిన మహిళ అనే సానుభూతితో ఓటేశారా? అనిచెందిన మహిళ అనే సానుభూతితో ఓటేశారా? అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. తను పెన్సిల్ అనుకొని బ్యాలెట్ పైన గీయడంతో మార్కు పడిపోయిందన్నారు. అందుకోసం ప్రత్యేకంగా బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అడిగానన్నారు. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వలేదని.. దీంతో మళ్లీ అదే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసి వచ్చానని.. ఎన్నికల కమిషన్ ఎలా పరిగణిస్తుందో చూడాలని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- కేసీఆర్ చెప్పిన క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ? ఆకస్మిక వరదలు స్పష్టించడం సాధ్యమా
- సికింద్రాబాద్ మహంకాళి బోనాల్లో ఉద్రిక్తత.. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లిన రేవంత్ రెడ్డి
- గోదావరికి వరదల వెనుక కుట్రలు… భద్రాచలంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
- ముంబైలో ఘనంగా తెలంగాణ ఆషాడమాస బోనాలు