
తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక బోనాలు. ఏటా ఆషాడమాసంలో హైదరాబాద్ లో నిర్వహించే బోనాల పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఒక్పపుడు తెలంగాణకే పరిమితమైన బోనాల పండుగ ఇప్పుడు విశ్వవాప్తమైంది. తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా ఘనంగా బోనాలు జరుపుకుంటున్నారు. అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాల్లో అత్యంత వైభవంగా బోనాల జాతర నిర్వహిస్తున్నారు. ఇక మనదేశంలోనూ పలు రాష్ట్రాల్లో ఆషాడమాస బోనాలను వైభవంగా జరుపుతున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఏడాది ఆషాడమాస బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదర్, బోయవాడ శ్రీ బాలాజీ కోపరేటివ్ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆషాడ బోనాలు నిర్వహించారు.
దాదార్ తో పాటు ముంబైలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు బోనాలు చేసి అమ్మవారికి సమర్పించుకున్నారు. దాదార్ లో జరిగిన ఆషాడమాస బోనాలకు మహారాష్ట్రలో సీనియర్ నేత, వోడాల ఎమ్మెల్యే కాళిదాస్ నీలకంఠ కోలంబ్కర్ తో పాటు క్రైమ్ మిర్రర్ సంపాదకులు మాకం గంగాధర్ నేత, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ నాగుల ఆనంద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంసృృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ బోనాల పండుగ జరుపుకోవడం సంతోషకరమని ఎమ్మెల్యే కాళీదాసు అన్నారు, తెలంగాణ ఆషాడమాస బోనాలకు ఘనంగా ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యేను మాకం గంగాధర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బోయవాడ శ్రీ బాలాజీ కోపరేటివ్ తెలుగు సొసైటీ సభ్యులు తిరందాసు సత్యనారాయణ, కొండా సత్యనారాయణ, నామని రాములు, పుల్పాటి రవి, బోడ బాల్ రాజు, కస్తూరి లక్ష్మయ్య, గంజి సీతారాములు, నల్ల కాషయ్య, తిరందాస్ అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- కేసీఆర్ చెప్పిన క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ? ఆకస్మిక వరదలు స్పష్టించడం సాధ్యమా
- సికింద్రాబాద్ మహంకాళి బోనాల్లో ఉద్రిక్తత.. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లిన రేవంత్ రెడ్డి
- గోదావరికి వరదల వెనుక కుట్రలు… భద్రాచలంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణ రాష్ట్రంలో సర్వేల సందడి….
- రేవంత్ రెడ్డికి టచ్ లో 20 మంది టీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు?
2 Comments