
గోదావరికి వచ్చిన ఆకస్మిక వరదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరిపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందన్నారు. దేశంలో ఆకస్మిక వరదలు స్పష్టిస్తున్నారని చెప్పారు. దేశంలో ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారన్న కేసీఆర్.. గతంలో లడఖాలోనే లేహా లో ఇలాంటే వరదలే వచ్చాయన్నారు. ఉత్తరాఖండ్ లో అలాగే చేశారన్నారు కేసీఆర్. కడెం ప్రాజెక్ట్ దేవుడి దయ వల్లే బయటపడిందన్నారు కేసీఆర్. కడెం ప్రాజెక్ట్ డిశ్చార్జ్ సామర్ధ్యం 3 లక్షల క్యూసెక్కులు కాగా ఎగువ నుంచి ఐదు లక్షల వరద వచ్చిందన్నారు.
గోదావరి వరదకు శాశ్వత పరిష్కారం కావాలన్నారు సీఎం కేసీఆర్. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని చెప్పారు. శాశ్వత కాలనీల కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని అన్నారు. వరదలతో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరదలతో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా అధికారులను భద్రాచలం పంపించామని కేసీఆర్ తెలిపారు. భద్రాచలంలో శాశ్వాత కాలనీల నిర్మాణం కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు కేసీఆర్. ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయలు అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.జూలై చివరు వరకు భారీ వర్షాలు ఉంటాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.