
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాజకీయ వాతావరణం వేడెక్కడంతోపాటు రాష్ట్రంలో సర్వేల సందడి కూడా పెరిగింది. అయితే, పార్టీల పరిస్థితిని చెప్పే ఈ సర్వేలు ఈసారి ఆ పరిధిని దాటి రాజకీయ వ్యూహంలో భాగమైపోయాయి. తమ పార్టీ గురించి తెలుసుకోవడమే కాదు.. ఓటర్లపై మానసికమైన ప్రభావం చూపించే వ్యూహాలు కూడా సర్వేల్లో కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తాము చేయించుకున్న సర్వేను, లేకుంటే ఇతరులు చేసిన సర్వేను తమకు అనుకూలంగా ప్రచారం చేసుకునే ఎత్తుగడలా ఉపయోగించుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీల బలాన్ని మార్చి చెప్పడం, లేని బలాన్ని ఉన్నట్లు చెప్పుకోవడం, వాటిని ప్రచారం చేయించడం ద్వారా ఓటర్లపై ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి, రాష్ట్రంలో ప్రతి పార్టీకి ఒక్కో సర్వే సంస్థ ఉంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి పీకే టీం, ఐప్యాక్ బృందాలు సర్వే చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అధిష్ఠానమే సునీల్‌ను నియమించింది. అవునన్నా, కాదన్నా బీజేపీకి ఆరా సంస్థ సర్వేలు చేసిస్తోంది. వీటికితోడు ఆత్మసాక్షిలాంటి సంస్థలు, బయటకు చెప్పని పలు సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తంమీద కొన్ని సంస్థలు సర్వేలు చేస్తుండగా.. మరికొన్ని అవసరాన్ని బట్టి, కాంట్రాక్టును బట్టి ఒక నియోజకవర్గం నుంచి కొన్ని నియోజకవర్గాల వరకు సర్వేలు చేసి ఇస్తున్నాయి.
Also Read : రేవంత్ రెడ్డికి టచ్ లో 20 మంది టీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు?
ఈ సర్వేలను రాష్ట్రంలోని పార్టీలే చేయించడం లేదు. ఢిల్లీ, ముంబైల నుంచి కొందరు వ్యక్తులు, నేతలు కూడా చేయిస్తున్నారు. ఇక, రాష్ట్రంలో ఇటీవల తొలుత టీఆర్‌ఎస్ పార్టీ సర్వే వ్యవహారం బయటకొచ్చింది. ఈసారి 30 శాతం మందికి టికెట్లు మార్చాలని, గెలిచే అవకాశాలు బాగానే ఉన్నాయని అందులో తేలిందన్న అంశాలు బయటికొచ్చాయి. ఈ సర్వే ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొంత గుబులు పుట్టించింది. అభ్యర్థిత్వాలు మార్చేస్తే తమ పరిస్థితి ఏమిటన్న అంతర్గత చర్చ మొదలైంది. అదే సమయంలో, ఆరా అనే సంస్థ చేసిన సర్వేలో కాంగ్రె్‌సకే అధిక స్థానాలు వస్తాయని తేలిందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో, ఆ సంస్థతో తెర వెనక ఉండి సర్వే చేయించిన వారు దానిని బయటపెట్టేలా చేశారు. అందులో కాంగ్రె్‌సకు మూడో స్థానమని పేర్కొన్నారు. ఆ తర్వాత తాజాగా ఆత్మసాక్షి సర్వే వచ్చింది. ఇది ఒక పార్టీకి అనుబంధమై పని చేయడం లేదని సమాచారం. ఇందులో కాంగ్రె్‌సకు రెండో స్థానం ఇచ్చారు. ఈ రెండూ విపక్షాలు చేయించిన సర్వేలేనని, వాటిలోనే టీఆర్‌ఎ్‌సకు అధిక స్థానాలు ఇచ్చారని, ఇక తమ సొంత సర్వేలో అయితే 90 సీట్లు వస్తాయని తేలిందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అయితే, ఆ సర్వేలు చేసిన వాళ్లు మాత్రం ప్రస్తుతానికి టీఆర్‌ఎ్‌సకు అధిక స్థానాలు వస్తున్నా.. గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయాయని, ఎన్నికల నాటికి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉందనే ప్రచారం చేస్తున్నారు.
Read Also : వరదలో కొట్టుకుపోయిన పడవ… ఎమ్మెల్యే సీతక్క తప్పిన పెను ప్రమాదం
అత్యవసరంసర్వేలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో నియోజకవర్గానికి లక్షల్లో తీసుకుంటారు. ఒకసారి సర్వే చేస్తేనే రూ.5-8 లక్షల వరకూ తీసుకుంటారు. కొంతమంది ఆరు నెలలపాటు నిరంతరం ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటారు. ఇందుకు నియోజకవర్గానికి రూ.25 లక్షల వరకు బిల్లు వేస్తారు. ఇక, రాష్ట్రం మొత్తమ్మీద సర్వే చేయాలంటే ఒక్కో పార్టీకి కోట్ల రూపాయల్లోనే ఖర్చవుతుంది. అయితే, పార్టీలకు వ్యూహకర్తలుగా పీకే, సునీల్ వంటి వారిని నియమించుకున్న వారు భారీ మొత్తంలోనే చెల్లించాల్సి ఉంటుంది. సర్వేలకు ఇంత భారీగా ఖర్చు చేయడానికి కారణం.. తాజా వ్యూహాలను రూపొందించుకోవడమే. ఉదాహరణకు, టీఆర్‌ఎస్ సర్వేలోనే కొత్త పింఛన్లు, కొత్త కార్డులు ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తి ఉందని తేలిందని సమాచారం. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాల పట్ల సానుకూలత ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి అనుగుణంగా ఆ పార్టీ తన కార్యక్రమాలను రూపొందించుకునే పనిలో ఉంది. కాంగ్రెస్, బీజేపీ చేయించుకున్న సర్వేల్లోను ఇలాంటి అంశాలను పరిశీలించి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాయి.
Also Read : వరద ప్రభావిత ప్రాంతాల్లో కెసిఆర్ ఏరియల్ సర్వే…
వ్యూహకర్తలతో నష్టాలూ ఉన్నాయ్‌వ్యూహకర్తలతో సదరు రాజకీయ పార్టీలకు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. తమ పార్టీలో ఫలానా సంస్థ సూచనలకు అనుగుణంగానే కార్యక్రమాలు నడుస్తాయని, టికెట్లు ఇస్తారనే అంచనాకు నేతలు, కార్యకర్తలు వస్తారు. పార్టీ అధిష్ఠానాలు ఆయా సంస్థలు చెప్పినట్లే చేస్తాయని భావిస్తారు. దీంతో, అధిష్ఠానానికి, నాయకులకు, కార్యకర్తలకు మధ్య దూరం పెరుగుతుంది. పీకే కావచ్చు.. సునీల్‌ది కావచ్చు. సర్వే సంస్థలు రాజకీయ వ్యూహం రూపకల్పన, సోషల్ మీడియా ప్రచారం, సర్వేలు చేస్తాయి. రాజకీయ వ్యూహంలో ఏయే అంశాలపై మాట్లాడాలి? ఏయే సమస్యలపై స్పందించాలి? పార్టీలతో పొత్తులు, ఇతర వ్యవహారాలకు సంబంధించి సలహాలిస్తాయి. తమ రాజకీయ వ్యూహాలు, సోషల్ మీడియా ప్రచారం కలగలిసి ప్రజలపై చూపిన ప్రభావం ఎంత? పార్టీలకు, అభ్యర్థులకు ఉన్న విజయావకాశాలు; ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? తదితరాలను వివరిస్తారు. నాయకుడికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడం, ఆందోళనలు చేయించడం కూడా ఇందులో భాగమే. ఈ క్రమంలో తమను నియమించుకున్న పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా వ్యూహకర్తలు అనేక సంక్షేమ పథకాల హామీలు గుప్పించేలా చేస్తారు. సంక్షేమ పథకాలు అవసరమే కానీ, అభివృద్ధి లేని సంక్షేమంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయనే ఆందోళనలూ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
- మత్స్యకారులకు దొరికిన 16 అడుగుల అరుదైన చేప..
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచి….. యువతులను మోసం చేసి
- ముఖ్యమంత్రి కెసిఆర్ పై బండి సంజయ్ ఫైర్…
- ముందస్తు ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేటిఆర్…
- హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ….