
క్రైమ్ మిర్రర్, నాంపల్లి : నారాయణపురం మండలం మర్రి బావి తండా దగ్గర మిషన్ భగీరథ పనుల్లో భాగంగా కరెంటు వైర్లు లాగుతుండగా నాంపల్లి మండలంలోని స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన తల్లోజు కృష్ణమాచారి ద్వితీయ కుమారుడు అరుణ్(21), నల్లపు వెంకటయ్య తృతీయ కుమారుడు ప్రశాంత్(17) విద్యుత్ షాట్ సర్క్యూట్ కు గురై మరణించిగా మరో ముగ్గురి కి తల్లోజ్ జంగయ్య కుమారుడు వంశీ(18), జెట్ట బోయిన ముత్యాలు కుమారుడు లింగయ్య(26), నారాయణపురం మండలానికి చెందిన మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబాల సభ్యులతో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు శుక్రవారం నాడు నాంపల్లి మండలం ఎస్ డబ్ల్యూ లింగోటం గ్రామంలో మిషన్ భగీరథ ఆఫీస్ ముందు ధర్నాకు దిగడం జరిగింది.
Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కెసిఆర్… అభ్యర్ధుల ఎంపికలో కొత్త వ్యూహం
మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, మిషన్ భగీరథ రాఘవ కాంట్రాక్టర్ లైసెన్స్ ని రద్దు చేయాలని, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరి నశించాలని, బాదిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం అద్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు నాంపల్లి ఎంపీపీ ఏడిదొడ్ల శ్వేత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పూల వెంకటయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, బి.ఎస్.పి జిల్లా నాయకులు పూదరి సైదులు, బిజెపి మండల నాయకులు సుధాకర్ రెడ్డి, నాంపల్లి సతీష్, దోటి పరమేష్, లింగోటం సర్పంచ్ ఆంగిరేకుల పాండు, ఎంపీటీసీ బెక్కం రమేష్, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, అంగిరేకుల పద్మ, స్వరూప, బెక్కం జ్యోతి, బెక్కం యాదమ్మ, బోదేసి మల్లమ్మ, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఇవి కూడా చదవండి :
- ముఖ్యమంత్రి కెసిఆర్ పై బండి సంజయ్ ఫైర్…
- ముందస్తు ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేటిఆర్…
- హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ….
- తెలంగాణా రాజకీయాల్లో రహస్య భేటీ దుమారం?