

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పోయిన సంవత్సరం నాగచైతన్య – సమంత ఇద్దరూ కూడా విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ ఏ కారణం చేత విడాకులు తీసుకున్నారో అనే విషయం మాత్రం ఇంకా అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ సమంత – నాగచైతన్య మాత్రం వారి జీవితంలో చాలా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. సుమారుగా ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న వీరు ఇలా మనస్పర్ధలు వచ్చి విడిపోవడం చాలా బాధాకరమని చెప్పవచ్చు.
Also Read : లేటు వయసులో ఘాటు ప్రేమ.. బాలివుడ్ స్టార్ సుస్మితాసేన్ తో లలిత్ మోదీ డేటింగ్
ఇకపోతే నాగచైతన్య – సమంతల బంధం, విడాకుల గురించి ఇటీవల సీనియర్ నటుడు మురళీమోహన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకవైపు తన వ్యక్తిగత విషయాలను తెలియజేస్తూనే మరొకవైపు నాగచైతన్య – సమంతల బంధం గురించి వాళ్లు విడాకులు తీసుకోవడానికి గల కారణాల గురించి కూడా వెల్లడించారు.. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నిజమే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో అపార్ట్మెంట్లో మూడు కట్టుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కట్టుకున్నవి అవి.. ఇక వాటిని చూసి నాగచైతన్య అమ్ముతారా అని అడిగారు. ఇది అమ్మడానికి కాదు మా ఫ్యామిలీ కోసం కట్టుకున్నామని చెప్పాను. ఇక అతను వెళ్లి నాగార్జునకి చెప్పినట్లున్నాడు. ఇండస్ట్రీకి రాకమందు నుంచి అక్కినేని ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం . ఇక నాగేశ్వరరావు గారికి కూడా నేనంటే అంతే అభిమానం. నాగార్జున గారు వచ్చి మాకు ఒకటి ఇవ్వండి అని అడిగితే కాదనలేకపోయాను. ఇక మా అబ్బాయి కోసం నిర్మించింది నాగచైతన్యకు ఇచ్చాను. అలా నాగచైతన్య – సమంత అపార్ట్మెంట్లోకి వచ్చారు.
Read Also : ‘ఆరా’ సర్వే ఫలితాలపై స్పందించిన కాంగ్రెస్, బిజేపి
చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఉదయాన్నే లేచి జిమ్ చేసే. చాలా బాగా కలిసి ఉండేవారు. పార్టీలు పెట్టడం.. గట్టిగా సౌండ్ చేయడం వంటివి చేసేవారు కాదు . అలాంటి వాళ్ళు విడిపోతున్నారు అని మా పనిమనిషి చెబితే తెలిసింది. ఇక అప్పటికే నాగచైతన్య బయట వేరే హోటల్లో ఉండడం లాంటివి చేశాడు. ఇక వాళ్ళు విడిపోవడానికి నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఎందుకు అనేది మాత్రం తెలియదు.. తెలిసుంటే కనుక నాగార్జునతో మాట్లాడి ఏదో ఒకటి చేసేవాడిని అంటూ మురళీ మోహన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి… ముగ్గురికి తీవ్ర గాయాలు
- ప్రజాదరణలో కేసీఆర్ 11వ స్థానం… దిగువ నుంచి ఆరో స్థానం (20)లో జగన్…
- మర్రిగూడ వైన్స్ లపై హెచ్ఆర్సిలో పిర్యాదు… నకిలీ మద్యం విక్రయం
- అమ్మాయిని పంపుతామంటే కోటిన్నర ట్రాన్స్ఫర్ చేసిన డాక్టర్….
- నిత్య పెళ్ళికొడుకు… వీధికో బార్య…
One Comment