
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలో పలు ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వం వరద బాధితులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా తక్షణ వరద సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తుంది. అయితే రాష్ట్రంలోని వరద పరిస్థితిపై, ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Read Also : ముందస్తు ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేటిఆర్…
తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కెసిఆర్ అసమర్థత వల్ల రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఇప్పుడు ముంపు దుస్థితి వచ్చిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నారం పంప్ హౌస్ నీట మునిగి పోయిన ఘటనపై సోషల్ మీడియా వేదికగా సీఎం కెసిఆర్ పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యంవల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నారం పంప్ హౌజ్ నీట మునిగిపోయిందని మండిపడ్డారు. కెసిఆర్ అంచనాల వ్యయాన్ని పెంచి వేల కోట్లు దోచుకోవడంలో చూపిన శ్రద్ధ, ప్రాజెక్టు నిర్మాణంలో చూపకపోవడం సిగ్గు చేటు అంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండ తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ప్రపంచంలో అతి పెద్ద గొప్ప ఇంజనీరింగ్ నిపుణుడిని అని చెప్పుకుంటారని, నదులకు నడకలు నేర్పినట్టు, తానే అపర భగీరథుడు అన్నట్టు ప్రగల్భాలు పలుకుతారు అంటూ ఎద్దేవా చేసి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు . తన నిర్వాకంవల్ల వేల కోట్ల రూపాయలు వృధా కావడమే కాకుండా మంథని, ధర్మపురి నియోజకవర్గాలు ఈరోజు పూర్తిగా నీటమునిగిపోయాయని బండి సంజయ్ ఆరోపించారు.
Also Read : తెలంగాణా రాజకీయాల్లో రహస్య భేటీ దుమారం?
ఇక వర్షాలు వరదల కారణంగా వందల కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన సిరిసిల్ల, జనగాం జిల్లా కలెక్టరేట్ భవనాలు సైతం నీట మునిగి, గోడలు నెర్రెలు బారడం దారుణం అంటూ బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ సర్కార్ పనితనం అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే గొప్ప నిర్మాణమని ప్రచారం చేసుకున్న యాదాద్రి నిర్మాణాలు సైతం నీటికి వంగిపోవడం అత్యంత సిగ్గు చేటు అని బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ చెప్పుకునేవి కేవలం ప్రగల్భాలు మాత్రమేనని, వాస్తవంగా కేసీఆర్ కు అంత లేదని బండి సంజయ్ తన వ్యాఖ్యల ద్వారా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సీఎంకేసీఆర్ కేవలం ఇంట్లో కూర్చుని సమీక్షలు చేస్తే సరిపోదని, ప్రజల కష్టాలను గుర్తించి తదనుగుణంగా పని చెయ్యాలని, ఒక్క ప్రాణ నష్టం జరిగినా కేసీఆర్ బాధ్యత వహించాలని ఇప్పటికే పలువురు నేతలు కేసీఆర్ ను టార్గెట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం రాష్ట్రంలో వర్షాలు పడుతుంటే మంత్రులు ఇళ్లకే పరిమితం అయ్యారని మండిపడ్డారు. వర్షాలు, వరదలతో జనం ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ….
- భార్య ప్రియుడితో లేచిపోయిందని తనువు చాలించిన భర్త…
- సమంత – చైతన్య విడాకులపై మురళీమోహన్ ఆసక్తికరమైన కామెంట్..!!
- ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కెసిఆర్… అభ్యర్ధుల ఎంపికలో కొత్త వ్యూహం
One Comment